E-Paper
Advertisement

Christmas Tree : విశ్వంలో క్రిస్మస్ ట్రీ

Christmas Tree : విశ్వంలో క్రిస్మస్ ట్రీ
Advertisement

Christmas Tree : గగనాంతర రోదసిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మిరుమెట్లు గొలిపే కాంతులతో క్రిస్మస్ ట్రీ ఒకటి శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. వాస్తవానికి అది క్రిస్మస్ ట్రీ. ఆ ఆకారంలో ఏర్పడిన నక్షత్రాల సమూహం. దానిని NGC 2264గా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ ట్రీ క్లస్టర్‌గానూ పిలుస్తున్నారు. అందమైన ఆ కాస్మిక్ ట్రీని నాసా తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.

భూమి నుంచి 2500 కాంతి సంవత్సరాల దూరంలో మన పాలపుంత గెలాక్సీలోనే ఉందా కాస్మిక్ ట్రీ. విశ్వం విస్తరణలో భాగంలో కొత్తగా ఏర్పడిన నక్షత్రాలు ఇలా క్రిస్మస్ చెట్టు రూపంలో ఒక క్టస్లర్‌గా ఏర్పడ్డాయి. ఆ నక్షత్రాల వయసు 1-5 మిలియన్ సంవత్సరాల లోపు ఉంటుంది. సూర్యుడి పరిమాణంతో పోలిస్తే.. ఆ యువ నక్షత్రాల్లో కొన్ని చిన్నవి కాగా.. మరికొన్ని చాలా పెద్దవి.

Advertisement

కాస్మిక్ ట్రీలోని తారలు అత్యంత క్రియాశీలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎక్స్-రేల రూపంలో అవి శక్తిని వెలువరిస్తున్నాయి. ఆ నక్షత్రాల చుట్టూ ఏర్పడిన వాయువులు మారుతున్నట్టు కూడా శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. చుట్టుపక్కల గ్యాస్ డిస్క్‌లు వెదజల్లుతున్న పదార్థాలు వాటిపై పడటం వల్ల ఈ మార్పులు సంభవిస్తుండొచ్చని భావిస్తున్నారు.

యువ నక్షత్రాలు నీలం, తెలుపు కాంతుల్లో ఎక్స్-కిరణాలను వెలువరుస్తున్నట్టు నాసా చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ చిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆకుపచ్చ కాంతి.. నెబ్యులాలోని వాయువులను ప్రతిబింబిస్తోందని శాస్త్రవేత్తలు వివరించారు. చిత్రంలో అక్కడక్కడా ధవళ కాంతిలో కనిపిస్తున్న చుక్కలు.. కాస్మిక్ ట్రీకి ముందు, వెనుక వైపు ప్రకాశిస్తున్న నక్షత్రాలని చెప్పారు.

Related News

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

Big Stories

Advertisement
×