E-Paper
Advertisement

Dawood Ibrahim: ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. ఏం జరిగింది ?

Dawood Ibrahim: ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం.. ఏం జరిగింది ?
Advertisement

Dawood Ibrahim: భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న దావూద్ ఇబ్రహీం.. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. అండర్‌వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం..ఆస్పత్రిలో ఉన్నట్లు సమాచారం. ఆయన వయసు 67 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆస్పత్రిలో రెండ్రోజుల క్రితమే దావూద్ ఇబ్రహీం అడ్మిట్ అవ్వగా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఆయనకు చికిత్స చేస్తున్నట్లు సమాచారం.

దావూద్ కు చికిత్స చేస్తున్న ఫ్లోర్ లో ఆయనొక్కడే పేషంట్ గా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రిలో వైద్యులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఆ ఫ్లోర్ కు అనుమతిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా.. దావూద్‌పై విష ప్రయోగం జరిగినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన సహాయకుడు మాత్రం దీనికి సంబంధించిన వివరాలేవీ చెప్పట్లేదు. ముంబై పోలీసులు ఈ విషయంపై మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. దావూద్ బంధువులైన అలీషా పార్కర్, సాజిద్ వాగిల్ ను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లు, డ్రగ్ మాఫియా సహా అనేక నేరాలకు పాల్పడ్డాడు.

Advertisement

.

.

Tags

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×