BigTV English

BiggBoss7 Winner: అడుగడుగునా అవమానాలు.. బిగ్ బాస్7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్

BiggBoss7 Winner: అడుగడుగునా అవమానాలు.. బిగ్ బాస్7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్

BiggBoss7 Winner: కామన్ మెన్ గా బిగ్ బాస్ సీజన్ 7లో బిగ్ హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ చరిత్ర సృష్టించాడు. ఆరు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ లో సెలబ్రిటీలే విజేతలవ్వగా.. మొదటిసారి ఒక కామన్ మెన్ బిగ్ బాస్ కప్పు గెలిచి.. బిగ్ బాస్ హిస్టరీలోనే రికార్డులకెక్కాడు. బిగ్ బాస్ 7 మొదలవ్వక ముందు పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో.. “అన్నా మల్లొచ్చినా.. అన్నా రైతుబిడ్డనన్నా.. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండన్నా” అంటూ వీడియోలు చేయగా.. అవి వైరల్ అయ్యాయి. మొత్తానికి బిగ్ బాస్ 7లోకి బియ్యం మూటతో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ను చూసి.. చాలా మందిని చూశాం.. ఇతను ఎన్నిరోజులుంటాడో చూద్దాం అని అనుకున్నవాళ్లే ఎక్కువ.


పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం అసాధ్యమనుకున్నవారంతా.. ఫినాలే రోజు ఆశ్చర్యపోయారు. రైతు బిడ్డ ట్యాగ్ తో సెంటిమెంట్ క్రియేట్ అయినా.. హౌజ్ లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. మధ్యలో ప్రేమ పేరుతో కంటెస్టంట్ ఇబ్బంది పెట్టినా.. క్షమించాడు. తనను మిగతా కంటెస్టంట్స్ తక్కువగా చూసినా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్, టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. పరుషపు మాటలతో మనసును గాయపరిచినా.. లక్ష్యంపై అతని దృష్టి మాత్రం చెదిరిపోలేదు.

ఫినాలే దగ్గరికొస్తున్న కొద్దీ పల్లవి ప్రశాంత్ పై ఇతర పీఆర్ టీమ్స్ నెగిటివ్ గా ప్రచారం చేసే ప్రయత్నం చేశాయి. అతనికి ఆల్రెడీ పెళ్లైందని, కోట్ల ఆస్తులున్నాయని ప్రచారం జరిగినా.. అవేవీ అతని విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా.. కప్ ను రూ.35 లక్షల ప్రైజ్ మనీతో పాటు, ఖరీదైన మారుతీ బ్రెజా కారు సొంతం చేసుకున్నాడు. టైటిల్ విన్నర్ గా బయటికొచ్చిన పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×