BigTV English

Middle East : పశ్చిమాసియా.. ఎంతో విలువ!

Middle East : పశ్చిమాసియా.. ఎంతో విలువ!

Middle East : వనరులకు పశ్చిమాసియా నిలయం. ప్రపంచ చమురు నిల్వల్లో 58% అక్కడే ఉన్నాయి. సహజవాయువు ఉత్పత్తి 9.6% మాత్రమే జరుగుతున్నా.. ప్రపంచ సహజవాయువు వనరుల్లో 37% మధ్యప్రాచ్యంలోనే నిక్షిప్తమయ్యాయి. పశ్చిమాసియా దేశాల్లో చమురు మాత్రమే కాకుండా మెటల్స్, కెమికల్స్, అగ్రికల్చర్ సంబంధిత పరిశ్రమలు ఎక్కువే. 2021లో ఈ రీజియన్ నుంచి జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 1.27 ట్రిలియన్ డాలర్లకు చేరింది.


ప్రపంచ ఎగుమతుల్లో ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా కన్నా వెనుకబడినప్పటికీ ఆఫ్రికా, దక్షిణ అమెరికాలను ఎప్పుడో తలదన్నింది. చమురుపై ఆధారపడటాన్ని ప్రపంచ దేశాలు తగ్గించుకుంటున్నప్పటికీ.. పశ్చిమాసియా నుంచి శిలాజ ఇంధనాల ఎగుమతులదే ఇప్పటికీ అధిక వాటా.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఒమన్ దేశాల ముడి చమురు ఎగుమతులకు ప్రసిద్ధి. ఖతర్ నుంచి పెట్రోలియం గ్యాస్, ఈజిప్టు నుంచి రిఫైన్డ్ పెట్రోలియం ఎగుమతులు ఎక్కువ. ఇక టర్కీ నుంచి కార్లు, ఇజ్రాయెల్ నుంచి వజ్రాల ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎగుమతుల విలువ రీత్యా చూస్తే యూఏఈ అగ్రభాగాన నిలుస్తుంది. ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 296 బిలియన్ డాలర్లు.


256 బిలియన్ డాలర్లతో సౌదీ అరేబియా, 234 బిలియన్ డాలర్లతో టర్కీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఖతర్ ఎగుమతుల విలువ 94.7బిలియన్ డాలర్లు, ఇరాక 81.1 బిలియన్ డాలర్లు, ఇజ్రాయెల్ 64.1, కువైత్ 58.2, ఒమన్ 56.9, ఈజిప్టు ఎగుమతుల విలువ 44.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

బహ్రెయిన్ నుంచి 15 బిలియన్ డాలర్లు విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. ఇరాన్ 14 బిలియన్ డాలర్లు , జోర్డాన్ 12, లెబనాన్ 4.8, యెమెన్ 2, అఫ్ఘానిస్థాన్ 1.9 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. పాలస్తీనా ఎగుమతులు 1.5 బిలియన్ డాలర్లు, సిరియా ఎగుమతులు 1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×