E-Paper
Advertisement

Randhir Jaiswal: ‘అది అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు’

Randhir Jaiswal: ‘అది అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు’
Advertisement

Randhir Jaiswal: పొరుగు దేశం నుంచి నిష్పాక్షిక ధోరణి కనిపిస్తోందంటూ భారత విదేశాంగ శాఖ పేర్కొన్నది. భారత్ తో కుదుర్చుకున్న ‘లాహోర్ డిక్లరేషన్’ ను పాకిస్థాన్ ఉల్లింగించిందంటూ ఆ దేశానికి చెందిన మాజీ ప్రదాని నవాజ్ షరీఫ్ ఇటీవల అంగీకరించిన విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించి ఈ విధంగా వ్యాఖ్యానించింది. అణ్వాయుధాల వాడకం నివారణ, రెండు దేశాల మధ్య శాంతి, స్థిరత్వం విషయమై 1999 ఫిబ్రవరి నెలలో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకం చేశారు.

దీనిపై నవాజ్ షరీఫ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించామని, అది ముమ్మాటికీ తప్పేనంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ దుస్సాహసానికి ఒడిగట్టినందునే కార్గిల్ యుద్ధం జరిగిందని ఆయన చెప్పారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ స్పందించారు. ఈ విషయంలో భారత్ వైఖరేంటో అందరికీ తెలుసు.. దాన్ని మళ్లీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై పాకిస్థాన్ లోనూ నిష్పాక్షిక దృక్పథం ఏర్పడినట్లు గమనించామంటూ ఆయన స్పందించారు.

Advertisement

Also Read: చైనాలో మరో కొత్త వైరస్‌.. సోకితే 3 రోజుల్లోనే మరణం

అదేవిధంగా మాల్దీవులతో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ అంశానికి సంబంధించి ప్రతిపాదనలేం లేవని రణ్ ధీర్ జైశ్వాల్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఆసక్తి చూపిస్తే ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరుదేశాల మధ్య ఎప్టీఏ కుదుర్చుకునేందుకే భారత్ ప్రయత్నాలు చేస్తున్నదని ఇటీవల మాల్దీవుల మంత్రి మహ్మద్ సయీద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.

Tags

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×