BigTV English

USA Cellular Outage : అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం.. సిగ్నల్స్ లేక అవస్థలు!

USA Cellular Outage : అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం.. సిగ్నల్స్ లేక అవస్థలు!
Cellular Outage in America

Cellular Outage in America(Today latest news telugu): అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. AT&T, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులకు.. నిన్నటి నుంచి సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. కాల్స్ కనెక్ట్ అవ్వక, మెసేజ్ లు సెండ్ అవ్వక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.


ఒక్క AT&T కస్టమర్ల నుంచే 31వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. వెరిజోన్ కు 1000కి పైగా ఫిర్యాదులు రాగా.. టీ-మొబైల్ కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 73వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. వెరిజోన్‌కు నాలుగువేలకు పైగా ఫిర్యాదులు రాగా టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి 18 వందల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.

కాగా.. కొన్నిగంటల తర్వాత నెట్ వర్క్ ను పునరుద్ధరించినట్లు AT&T వెల్లడించింది. సుమారు 10 గంటలకు పైగా నెట్ వర్క్ లో అంతరాయం ఏర్పడింది. యునైటెడ్ స్టేట్స్ లో 290 మిలియన్ల మంది 5జీ నెట్ వర్క్ ను ఉపయోగిస్తున్నారు.


Read More: జాహ్నవి కందుల మృతి కేసు.. ఆ పోలీసు అధికారిపై నో యాక్షన్..

బూస్ట్ మొబైల్ 700 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. అత్యవసర సేవల కోసం.. 911 ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అయితే, ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. సైబర్‌ దాడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

కొంతకాలం క్రితం పాకిస్థాన్​లో ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్థాన్​లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆప్టిక్​ ఫైబర్ నెట్​వర్క్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించామని అధికారులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్​, లాహోర్ పట్టణాల్లో ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల బ్యాంక్​లు, ఆన్​లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాక్ లో 3జీ నెట్ వర్క్ లో 116 మిలియన్ల వినియోగదారులు ఉండగా.. 4జీ వినియోగదారులు 119 మిలియన్ల మంది ఉన్నట్లు పాకిస్థాన్ టెలికాం అథారిటీ వెల్లడించింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×