BigTV English
Advertisement

Triplets Script History : 93 ఏళ్ల వయసు.. ట్రిప్లెట్స్ రికార్డ్..

Triplets Script History : 93 ఏళ్ల వయసు.. ట్రిప్లెట్స్ రికార్డ్..
Triplets Script History

Triplets Script History : కవలలు అంటేనే అరుదు. ఆ ముగ్గురు కవల సోదరులైతే మరీ స్పెషల్. అమెరికాలోని కన్సాస్‌కు చెందిన ఆ సోదరులు ఈ నెల ఒకటిన తమ 93వ పుట్టిన రోజు జరుపుకున్నారు. జీవిస్తున్న కవలల్లో వయోధిక ట్రిప్లెట్స్‌గా లారీ ఆల్డెన్ బ్రౌన్, లోన్ బెర్నార్డ్ బ్రౌన్, జీన్ కరోల్ బ్రౌన్ ప్రపంచ రికార్డులకు ఎక్కారు.


మహామాంద్యం సమయంలో 1 డిసెంబర్ 1930లో వారు కెల్వెస్టాలో జన్మించారు. ఐదో కాన్పులో జన్మించిన ఆ కవలలకు ముగ్గురు అన్నలు, ఒక అక్క ఉన్నారు. ఆ కుటుంబంలో కవల సోదరులు మినహా మిగిలినవారంతా మరణించారు. కవల సోదరుల్లో తొలుత లారీ .. ఆ తర్వాత లోన్, జీన్ పుట్టారు.

‘మరోసారైనా కలిసి పుట్టిన రోజు జరుపుకుందామని ఆశపడ్డాం. కానీ ఓక్లహామాలో ఉంటున్న జీన్ ప్రయాణించే స్థితిలో లేకపోవడంతో.. ఈ సారి పుట్టిన రోజు వేడుకలో లోటు కనిపించింది’ అని లారీ బ్రౌన్ వివరించారు. నిరుడు 92వ జన్మదినం సందర్భంగా ముగ్గురూ కలిసే వేడుకలు జరుపుకున్నారు. ముగ్గురు కవల సోదరులు చివరిసారిగా కలిసింది అప్పుడే.


దూరాభారాన్ని సైతం లెక్కచేయకుండా ఇన్నేళ్లుగా కవల సోదరులు కలిసి వేడుకలు నిర్వహించుకోవడం విశేషమే. ఎక్కడెక్కడో ఉన్న ఆయా కుటుంబాల సభ్యులు డిసెంబర్ 1న మాత్రం ఒక్క చోటే గుమికూడతారు. ట్రిప్లెట్ సోదరులకు బాస్కెట్ బాట్ ఆడటమంటే మహా సరదా.

1950-51లో కొరియా యుద్ధ సమయంలో ముగ్గురూ కలిసి వైమానికదళంలో చేరాలని అనుకున్నారు. ఆస్త్మా కారణంగా లారీకి మాత్రం అవకాశం దక్కలేదు. మిగిలిన ఇద్దరూ ఎయిర్ ఫోర్స్ ఒప్పందంపై సంతకాలు చేసేశారు.

కవల సోదరుల కుటుంబాలు కలిస్తే సందడే సందడి. కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మునిమనవళ్లు.. అందరినీ కలిపితే సభ్యుల సంఖ్య మొత్తం 65. ఇంత సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి కారణమేమిటని ఎవరైనా ఆ సోదరులను ప్రశ్నిస్తే.. వారు తడుముకోకుండా చెప్పే సమాధానం తమకు ఎలాంటి అలవాట్లు లేవని.

స్మోకింగ్, డ్రికింగ్, డ్రగ్స్ వంటివి ఎన్నడూ దరిదాపుల్లోకి రానీయలేదా కవల సోదరులు. అన్నింటికీ మించి తాము స్నేహితుల్లా ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పారా అపూర్వ సహోదరులు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×