E-Paper
Advertisement

ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి.. చైనాకు చెక్ పెట్టేందుకు పావులు, ఇండియా కీ రోల్ తప్పదా?

ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి.. చైనాకు చెక్ పెట్టేందుకు పావులు, ఇండియా కీ రోల్ తప్పదా?
Advertisement

Malacca Strait: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తదుపరి లక్ష్యం ఏంటి? క్యూబా, గ్రీన్‌లాండ్ అంటూ చాలామంది రకకాల పేర్లు చెప్పారు. ఆయన మలక్కా జలసంధిని టార్గెట్ చేసినట్టు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ జలసంధి ఎక్కడ ఉంది? ఇండియాకు అది కీలకమా? ఒక్కసారి చూద్దాం.

ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి

Advertisement

హర్మూజ్‌ జలసంధిపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మలాకా జలసంధిపై ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇండోనేసియాతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నది అసలు సారాంశం. ఈ క్రమంలో అమెరికా-ఇండోనేసియా రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మలాకా జలసంధి అనేది ఇండోనేసియా-మలేసియా-సింగపూర్‌లకు నౌకా రవాణాకు ప్రధాన మార్గం. భారత్‌కు దగ్గరలో ఉంటుంది కూడా. రెండురోజుల కిందట అంటే సోమవారం అమెరికా-ఇండోనేషియాల మధ్య రక్షణ సహకార ఒప్పందం జరిగింది. దీనివెనుక అసలు విషయం ఏంటో తెలీదు. మలక్కా జలసంధిని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ స్కెచ్ వేశారని అంటున్నారు.

Advertisement

ప్రపంచ వాణిజ్యంలో 40 శాతం నౌకా రవాణా మలక్కా జలసంధి మీదుగా సాగుతోంది. చమురు దిగుమతులతో పాటు కార్లు, సెమీకండక్టర్లు, యంత్ర సామగ్రి వస్తువులు రవాణా అవుతున్నాయి. చైనా-జపాన్‌ల ఎగుమతి- దిగుమతులకు మలాకా జలసంధి చాలా కీలకం. దానిపై పట్టు సాధిస్తే ఆసియాలో ఎగుమతి-దిగుమతులకు ఆధిపత్యం సాధించవచ్చని వాషింగ్టన్ ఆలోచన.

చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతోంది

మలాకా జలసంధి చైనాకు చాలా కీలకమైనది. ఇటీవల కాలంలో పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో, మలాకా జలసంధికి సమీపంలో భారీ ఎత్తున సముద్ర మ్యాపింగ్ చేసింది. ఆపై పర్యవేక్షణ కోసం కసరత్తులు మొదలు పెట్టింది. అమెరికా అక్కడ అడుగుపెడితే చైనా సైలెంట్‌గా ఉంటుందా? అనేది అసలు ప్రశ్న.

మలాకా జలసంధి చాలా కీలకం. దాని ద్వారా సముద్ర సరిహద్దు- చిన్న దీవుల నియంత్రణ ఉంటుంది.  ఇండోనేసియా-సింగపూర్‌ల మధ్య వివాదాలు లేకపోలేదు. అమెరికా మిత్రుడు సింగపూర్‌ ఈ జలసంధి ద్వారా వ్యాపార ప్రయోజనాల్లో అగ్రభాగం అందుకుంటోంది. హర్మూజ్‌లో నౌకల రాకపోకలపై ఇరాన్‌ సుంకాలు విధించడం గమనించిన ఇండోనేసియా-మలేసియాలు మలాకా జలసంధి పేరిట పన్నులు విధిస్తాయని సింగపూర్‌‌ని భయం వెంటాడుతోంది.

ALSO READ: ఇరాన్ విలవిల.. యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న ట్రంప్! ఇదిగో వీడియో

భారత్ వాణిజ్యంలో సుమారు 55 శాతం మలక్కా జలసంధి ద్వారా జరుగుతుంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల దక్షిణ భాగం చివరి నుంచి అక్కడికి ఈజీగా చేరుకోవచ్చు. ఇది చైనాకు కాస్త ఆందోళన కలిగించే విషయం. పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి మలక్కా జలసంధిని చేరుకోవడానికి ఒక్కరోజులో చేరుకోవచ్చు.

హిందూ మహా సముద్రంలో చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను బలోపేతం చేయడానికి అమెరికా మొగ్గు చూపడం వెనుక ఇదొక కారణం. ఆ ప్రాంతంలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్‌ సహాయం చాలా కీలకం. అంతేకాదు హోర్మూజ్ జలసంధి విషయంలో అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా. ఈ నేపథ్యంలో చైనాను తన దారికి తెచ్చుకోవడానికి మలక్కా జలసంధిని టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మలక్కా జలసంధి గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వస్తాయో చూడాలి.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×