River Linking: నదుల అనుసంధానం.. ఇది కొత్త చర్చేమీ కాదు. దశాబ్దాలుగా ఈ టాపిక్ నలుగుతూనే ఉంది. తాజాగా ఏపీలోని భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీళ్ల సమస్య ఉందని.. ఆ ప్రాంతాలకు నీటిని మళ్లించగలిగితే కలిగే సంతోషం వేరని CM చంద్రబాబు చెప్పడంతో ఈ టాపిక్ మళ్లీ తెరపైకి వ చ్చింది. గోదావరి, కావేరీ, మహానది, గంగా వంటి నదులను అనుసంధానం చేసి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే.. భారత అభివృద్ధి అన్‌స్టాపబుల్‌గా పరుగులు తీస్తుందన్నారు. అందుకే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చుట్టూ చర్చ నడుస్తోంది. నిజానికి ఈ నదుల అనుసంధానం టాపిక్ ఇప్పుడు రావడానికి ఓ కారణం ఉంది. ఈ ఏడాది ఏపీలో వర్షపాతం లోటు ఏకంగా 54.7 శాతానికి చేరింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం.. నీటి వనరులపై ఒత్తిడి పెరగడం.. వ్యవసాయంపైనా ప్రభావం చూపుతున్నాయి. అయితే నదుల అనుసంధానం అంత ఈజీ పరిష్కారమా..? పర్యావరణం, రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, భారీ ఖర్చు, భూసేకరణ.. ఎన్నో సవాళ్లు ఉన్నాయ్. మరి ఇది కార్యరూపం దాల్చే పనేనేనా?