E-Paper
Advertisement

Trump Statement: ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌ జలసంధి క్లీనింగ్ మొదలు, ఏం జరిగింది?

Trump Statement: ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌ జలసంధి క్లీనింగ్ మొదలు,   ఏం జరిగింది?
Advertisement

Trump Statement: ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా హోర్మూజ్‌ జలసంధిపై ఆయన ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. జలసంధి క్లీనింగ్ మొదలు పెట్టినట్టు తెలిపారు.

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక ప్రకటన

Advertisement

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు చెందిన రెండు యుద్ధనౌకలు హర్మూజ్‌ జలసంధిని దాటినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత అమెరికాకు చెందిన రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్మూజ్‌ జలసంధిని దాటడం ఇదే మొదటిసారి.

జలసంధిని తెరిచే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ విషయంలో ఆసియా, యూరప్‌లోని చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు సాయం చేస్తున్నామని చెప్పకనే చెప్పారు. ఈ పని చేసే ధైర్యం ఆయా దేశాలకు లేదన్నారు.

Advertisement

జలసంధి క్లీనింగ్ మొదలు.. రెండు అమెరికా నౌకలు దాటినట్టు వార్తలు

ఈ జలసంధిలో ఇరాన్‌ అమర్చిన మందుపాతరలతో ముప్పు ఉందని చెబుతూనే, ఈ యుద్ధంలో ఇరాన్‌ భారీగా నష్టపోతోందన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక మేరకు.. ఈ నౌకలు గల్ఫ్‌లోకి ప్రవేశించి తిరిగి అరేబియన్ సముద్రంలోకి చేరుకున్నాయని తెలిపింది. తాము హోర్మూజ్‌ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.

మరోవైపు అమెరికన్ నౌకలు జలసంధిలో ప్రయాణించాయన్న అమెరికా వాదనలను ఇరాన్ ఖండించింది. హోర్ముజ్‌ను దాటడానికి ప్రయత్నించే ఏ సైనిక నౌకనైనా కఠినంగా శిక్షిస్తామని ఐఆర్‌జిసి హెచ్చరిక చేసింది. షరతులకు లోబడి పౌర నౌకలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు ఇరాన్ పేర్కొంది.

తాము గట్టి హెచ్చరిక జారీ చేయడంతో అమెరికా నౌకలు హోర్ముజ్ జలసంధి నుండి వెనుదిరిగిందని ఇరాన్ పేర్కొంది. డిస్ట్రాయర్ నౌక జలసంధి గుండా ప్రయాణించి అరేబియా సముద్రంలోకి వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చిందని తెలిపింది. దీన్ని సాధారణ నౌకా స్వేచ్ఛ ఆపరేషన్‌గా పేర్కొంది. మరోవైపు ఇస్లామాబాద్ శాంతి చర్చలపై అధ్యక్షుడు ఆదివారం ఓ ప్రకటన చేసే అవకాశముందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ALSO READ: వాషింగ్టన్ లో 250 అడుగుల ‘ఆర్క్ డి ట్రంప్’ ఆర్చ్.. వివాదాస్పద ప్రాజెక్ట్ డిజైన్ రిలీజ్

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×