BigTV English

America : హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

America : అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ సంఘటన పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆలయ గోడలపై భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ వర్గం వారు వివాద స్పంద వ్యాఖ్యలు రాసారు. ఆలయంలో ఖలిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు రాశారు. అంతేకాకుండా ఆలయ పరిశర ప్రాంతాలను ధ్వంసం చేశారు.

America : హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

America : అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ ఘటన పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఆలయ గోడలపై భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ వర్గం వారు వివాదాస్పద వ్యాఖ్యలు రాసారు. ఆలయంలో ఖలిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు రాశారు. అంతేకాకుండా ఆలయ పరిశర ప్రాంతాలను ధ్వంసం చేశారు.


ఈ ఘటన‌పై నెవార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన పై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన డిసెంబర్ 22 న వెలుగులోకి వచ్చింది అని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు రోజు రాత్రి ఈ ఘటన చోటుచేస్కుందని పోలీసులు పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని విడిచిపెట్టబోమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. తీవ్రవాదులు , వేర్పాటు వాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని ఆయన తెలిపారు. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కించపరిచిందని తెలిపారు.


ఆలయంపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ని భారత కాన్సులేట్ ఈ ఘటనపై అన్ని విధాల దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని యూఎస్ ప్రభుత్వానికి, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×