BigTV English

United Airlines Flight Loses Tire in Air: ఊడిపడిన టైరు.. గాల్లో 235 మంది ప్రాణాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

United Airlines Flight Loses Tire in Air: ఊడిపడిన టైరు.. గాల్లో 235 మంది ప్రాణాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..?


Tire Falls off After Plane Takeoff: ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని టైరు ఊడిపడిపోయింది. ఆ సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఒక విమానానికి జరిగిన ప్రమాదం ఇది. పైలట్లు అప్రమత్తమవ్వడంతో.. తృటిలో పెనుప్రమాదం తప్పినట్లయింది. టైరు ఊడిపడటాన్ని గమనించిన పైలట్లు అప్రమత్తమై.. ఫ్లైట్ ను దారిమళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777-200 విమానం స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్ లోని ఒసాకాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనుకవైపున ల్యాండింగ్ గేర్ లో టైర్ ఊడిపోయింది. ఆ టైర్ విమానాశ్రయంలో పార్కింగ్ లాట్ లో ఉన్న వాహనాలపై పడటంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో వాహనం తీవ్రంగా ధ్వంసమైంది.


ఫ్లైట్ టైర్ ఊడిందన్న విషయాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని వెంటనే దారిమళ్లించి లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయిందని, అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపామని ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. కాగా.. బోయింగ్ 777 విమానాలలో 2 ల్యాండింగ్ గేర్లకు 6 టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ ను డిజైన్ చేశారు. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×