E-Paper
Advertisement

US Air Force F-16 Crash: కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్.. వైరల్ అవుతోన్న వీడియో

US Air Force F-16 Crash: కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్.. వైరల్ అవుతోన్న వీడియో
Advertisement

US Air Force F-16 Crash: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్‌-16సి ఫైటర్‌ జెట్‌.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారి ప్రాంతంలో కుప్పకూలిన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. ప్రమాదం అత్యంత తీవ్రంగా ఉన్నప్పటికీ పైలట్ సురక్షితంగా బయటపడటంతో అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫైటర్ జెట్, అమెరికా వైమానిక దళానికి చెందిన ప్రఖ్యాత విన్యాస బృందమైన US Air Force Thunderbirds స్క్వాడ్రన్‌కు చెందినదిగా అధికారికంగా ధ్రువీకరించారు.

ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారి ప్రాంతంలో ఉన్న ట్రోనా ఎయిర్ పోర్ట్ (Trona Airport) సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. యుద్ధ విన్యాసాల ప్రదర్శనలో భాగంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా ఫైటర్ జెట్ అకస్మాత్తుగా సమతుల్యత కోల్పోయి నేరుగా నేలను ఢీకొట్టింది. నేలపై పడిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.

Advertisement

అయితే విమానం కుప్పకూలడానికి కొద్ది సెకన్ల ముందు.. పైలట్ అప్రమత్తమై అత్యవసర ఎజెక్షన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి పారాచ్యూట్ సహాయంతో కిందకు దూకడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన గాల్లో నుంచి కిందకు దూకుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రమాదం అనంతరం పైలట్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. ఫైటర్ జెట్ పూర్తిగా ధ్వంసమై కాలిపోయిందని, ప్రమాద స్థలం చుట్టూ భద్రతా బలగాలు కార్డన్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

ఈ ఘటనపై థండర్‌బర్డ్స్ స్క్వాడ్రన్ అధికారికంగా స్పందిస్తూ, తమ స్క్వాడ్రన్‌కు చెందిన ఎఫ్-16సి ఫైటర్ జెట్ ఒకటి విన్యాసాల సమయంలో ప్రమాదానికి గురైందని ధ్రువీకరించింది. శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా మొత్తం ఆరు జెట్‌లతో విన్యాసాలు నిర్వహిస్తుండగా, వాటిలో ఒక జెట్ మాత్రమే కుప్పకూలిందని పేర్కొంది. మిగతా జెట్‌లు సురక్షితంగా ఉన్నాయని, శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కూడా వెల్లడించింది.

అమెరికా ఎయిర్‌ఫోర్స్ సాధారణంగా ఈ ప్రాంతంలో ఎఫ్-16 ఫైటర్ పాల్కన్ జెట్‌లతో నిరంతరం యుద్ధాభ్యాసాలు నిర్వహిస్తుంది. ఈ జెట్‌లు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడినవిగా, ఒకే ఒక శక్తివంతమైన ఇంజిన్‌తో పనిచేస్తాయి. అధిక వేగం, ఖచ్చితమైన నియంత్రణ, అత్యంత కఠినమైన యుద్ధ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వీటి ప్రత్యేకత. అయితే ఒకే ఇంజిన్‌పై ఆధారపడటం వల్ల సాంకేతిక లోపాలు తలెత్తితే ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై అమెరికా వైమానిక దళం దర్యాప్తు ప్రారంభించింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపమా? లేదా పైలట్‌కు సంబంధించిన మానవ తప్పిదమా? లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. విమానం నుంచి లభించిన బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా పూర్తి నివేదిక సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.

Related News

కార్నివాల్ క్రూయిజ్ షిప్‌లో.. ఓ మహిళ ఒకటే గోకుడు, వీడియో వైరల్

హౌతీలు ప్రకటన.. బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత, ప్రపంచ దేశాల్లో గుబులు

పశ్చిమాసియాలో యుద్ధ భేరి.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత!

ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన అఫ్గానిస్తాన్‌.. 20 మంది మృతి, 100 మంది గల్లంతు

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Big Stories

Advertisement
×