BigTV English

US Detroit Gun Shooting| డెట్రాయిట్‌లో భారీ కాల్పులు.. ఇద్దరు మృతి, 19 మందికి తీవ్ర గాయాలు!

US Detroit Gun Shooting| డెట్రాయిట్‌లో భారీ కాల్పులు.. ఇద్దరు మృతి, 19 మందికి తీవ్ర గాయాలు!

US Detroit Gun Shooting| ఆదివారం జూలై 7, 2024 తెల్లవారుజామున మిచిగాన్, డెట్రాయిట్‌ ప్రాంతంలో విధ్వంసకర కాల్పుల సంఘటన జరిగింది. మిచిగాన్ స్టేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ షాకింగ్ ఘటనలో ఇద్దరు మరణించగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. నిందితుల గురించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.


Also Read: France Elections| హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికలు.. అధ్యక్షుడు మాక్రాన్ కు ఇకముందు కష్టాలే!

కాల్పులకు సంబంధించి అనుమానితులను అధికారులు ఇంకా పట్టుకోలేదు. మరింత సమాచారాన్ని తర్వలోనే విడుదల చేస్తామని తెలిపారు.


అమెరికాలో ఇలాంటి గన్ షూటింగ్ ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి మానవ హక్కువ సంఘం అమెరికాలోని గన్ షూటింగ్ కల్చర్ ను కారణమని నిందిస్తోంది. ఇలాంటి ఘటనలు ముఖ్యంగా జన సమూహాలు ఎక్కువగా ఉన్న సమయంలో అంటే వారాంతాల్లో జరుగుతున్నాయి. ఎక్కువ హింసాత్మక ఘటనలు వేసవి కాలం.. ముఖ్యంగా జూలై నెలలో జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మానసిక నిపుణుల ప్రకారం.. గన్ షూటింగ్ ఘటనలకు అమెరికాలోని సోషల్ కల్చర్, మద్యపానం పార్టీలకు ఆపాదిస్తున్నారు.

Also Read: Pakistan| 15 రోజుల చంటి పాపను సజీవంగా పాతిపెట్టిన తండ్రి!.. ఎందుకంటే?

కెంటకీలో నలుగురు మృతి
శనివారం తెల్లవారుజామున, కెంటకీలోని ఫ్లోరెన్స్‌లోని ఒక ఇంట్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఇంటి యజమాని.. 21 ఏళ్ల కుమారుడి పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల అనుమానిత షూటర్ కాల్పుల తరువాత సంఘటన స్థలం నుండి పారిపోయాడు.

పోలీసులు అతడని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అతను తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

 

 

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×