E-Paper
Advertisement

America News: బాంబు పేల్చిన అమెరికా.. జనవరి నుంచి 85 వేల వీసాల రద్దు, భారత్‌పై ప్రభావం ఎంత?

America News: బాంబు పేల్చిన అమెరికా.. జనవరి నుంచి 85 వేల వీసాల రద్దు, భారత్‌పై ప్రభావం ఎంత?
Advertisement

America News: వలసలపై కఠినచర్యలు చేపట్టింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం . ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అనగా 2026 జనవరి నుంచి 85 వేల వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. రద్దు చేయబడిన వీసాల్లో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement

వలసదారులకు మరో షాకిచ్చిన అమెరికా

Advertisement

అమెరికాలో జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ప్రకటనతోపాటు ‘మేక్ అమెరికా సేఫ్ ఎగైన్’ అనే అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటో ఉపయోగించింది. అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి రూబియో దీనికి కట్టుబడి ఉన్నారని చెప్పకనే చెప్పింది. ఈ సంఖ్య 2024 కంటే రెట్టింపని ఓ అధికారి అన్నారు.

జనవరి నుంచి రద్దు చేయబడుతున్న 85 వేల వీసాల్లో 8,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ విద్యార్థులకు చెందినవి. ఈ విషయాన్ని ఆదేశ విదేశాంగ శాఖలోని సీనియర్ అధికారి వెల్లడించారు. అందుకు ప్రధాన కారణాలు లేకపోలేదు. మద్యం సేవించి వాహనం నడపడం, దొంగతనం, దాడి వంటి నేరాలు ఉన్నాయి.

జనవరి నుంచి 85 వేల వీసాల రద్దు

వీటి కారణంగా ఇప్పటివరకు సగం రద్దులకు కారణమయ్యాయని CNN ఛానెల్ వెల్లడించింది. నేరాలకు సంబంధించి వీసాల రద్దులో గణనీయమైన భాగంగా ఉన్నప్పటికీ, మిగిలినవాటిపై ఆ విభాగం బహిరంగంగా స్పష్టం చేయలేదు. వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు వంటి ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు.

ఇటీవల వీసాలకు సంబంధించి భారతీయ- అమెరికన్​ దౌత్యవేత్త మహవష్సిద్ధిఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు జారీ చేసిన దాదాపు 80 హెచ్​1బీ వీసాలు నకిలీవని ఆయన ఆరోపించారు. వాటిలో ఫేక్ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్ల ద్వారా వాటిని పొందారని చెప్పారు. హెచ్​1బీ వీసాకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు లేవన్నది ఆయన మాట.

ALSO READ: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత

అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్​ డేవ్బ్రాట్​ కూడా ఆ తరహా వ్యాఖ్యలు చేశారు. చెన్నై సిటీ నుంచి 2 లక్షలకు పైగా హెచ్​1బీ వీసాలు రావడంపై అనుమానం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. వీసా, వలసదారులపై జరిగిన.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 85 వేల వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. ఇందులో భారత్‌కి చెందినవారు ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత రావాల్సివుంది.

ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. ట్రంప్ పాలనలో వీసాదారులపై పరిశీలనను పెంచింది. విద్వేష ప్రసంగాలు చేసినవారు ఎవరైనా ఉంటే తిరస్కరించాలని కాన్సులర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే పలు దేశాలపై పాక్షిక లేదా పూర్తి ప్రయాణ ఆంక్షలు విధించింది అమెరికా. 19 దేశాల నుండి వలసలను నిలిపి వేస్తున్నట్లు గత వారం ప్రకటించింది.

 

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×