Israel Election Results: ఇజ్రాయెల్‌లో ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు పూర్తయింది. కానీ కొత్త ప్రభుత్వం ఎవరిదనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ ఎలక్షన్స్‌లో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. బట్… అధికారాన్ని నిలబెట్టుకునేంత మెజారిటీ మాత్రం సాధించలేకపోయింది. మరోవైపు ప్రతిపక్షం కూడా మ్యాజిక్ ఫిగర్‌కు దూరంగానే ఉంది. ఇదే టైమ్‌లో ఎన్నికల్లో విదేశాలు జోక్యం చేసుకున్నాయంటూ సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఖతార్, టర్కీ పేర్లు వినిపించాయి. అసలు ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఏం జరిగింది? నెతన్యాహూకు ఎందుకు మెజారిటీ రాలేదు? అరబ్ పార్టీలు ఇప్పుడు కింగ్‌మేకర్లుగా ఎలా మారాయి? విదేశీ జోక్యం ఆరోపణల వెనుక కథేంటి?
ఇజ్రాయెల్ ఎన్నికల రిజల్ట్స్..
ముందుగా ఇజ్రాయెల్ ఎన్నికల రిజల్ట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. క్నెసెట్.. అంటే ఇజ్రాయెల్ పార్లమెంట్. ఇందులో మొత్తం 120 స్థానాలుంటాయి. ఈ 120 స్థానాల కోసం అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 30 నాటికి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎలక్షనస్‌లో బెంజమిన్ నెతన్యాహూ కూటమికి 53 స్థానాలు వచ్చాయి. గడి ఐసెన్‌కోట్‌కు చెందిన ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు దక్కాయి. ఇక అరబ్ పార్టీల కూటమి 19 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
నెతన్యాహూ ప్రభుత్వానికి మద్దతు..
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 61. కానీ నెతన్యాహూ కూటమికి 53 సీట్లే వచ్చాయి. మరో 8 మంది మద్దతు కావాలి. ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు రావడంతో మరో 13 మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే అతిపెద్ద కూటమిగా ఉన్నంత మాత్రాన నెతన్యాహూ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు.
ఇజ్రాయెల్ రాజకీయాల్లో అత్యంత కీలకం
ఇది సినారియో.. ఇక ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది అరబ్ పార్టీలకు వచ్చిన 19 సీట్లు. ఇందులో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి జాయింట్ లిస్ట్.. మరోకటి యునైటెడ్ అరబ్ లిస్ట్. ఈ రెండు పార్టీల కూటమికి వచ్చిన 19 సీట్లే ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారాయి. ఎందుకంటే ప్రతిపక్ష కూటమికి అరబ్ పార్టీలు మద్దతిస్తే.. 61 సీట్ల మెజారిటీ మార్క్ దాటేయొచ్చు.
పొలిటికల్ లాజిక్..
వినడానికి సింపుల్‌గా ఉంది కదా.. కానీ ఇక్కడే ఒక పొలిటికల్ లాజిక్ ఉంది. ఐసెన్‌కోట్ కూటమిలోని కొందరు నేతలు గతంలో అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదని అనౌన్స్ చేశారు. మరోవైపు జాయింట్ లిస్ట్ నేత యూసుఫ్ జబరీన్.. నెతన్యాహూను అధికారానికి దూరం చేసే ప్రయత్నాలకు సహకరించేందుకు సిద్ధమని సిగ్నల్ ఇచ్చారు. అంటే అరబ్ పార్టీలు సపోర్ట్ చేస్తాయా? బయట నుంచి సహకరిస్తాయా? లేక తటస్థంగా ఉంటాయా? అనేదే ఇప్పుడు కీలకంగా మారింది.
ఎన్నికల ఫలితాలపై మరో వివాదం
అసలు అధికారం ఎవరికి దక్కుతుందనేదే పెద్ద మిస్టరీగా ఉన్న ఈ టైమ్‌లో.. ఎన్నికల ఫలితాలపై మరో వివాదం మొదలైంది. నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ అరబ్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేసింది. కొన్ని ఏరియాల్లో ఓటర్లకు డబ్బులు పంచారని.. భారీగా అరబ్ ఓటర్లను మొబలైజ్ చేసి ఓట్లు వేయించారని.. పోలింగ్ సిబ్బందిని బెదిరించారని, డబుల్ ఓటింగ్ జరిగిందనేది వారు చేస్తున్న ఆరోపణ. అంతేకాదు రిజల్ట్‌ను మార్చేలా నిషేధిత సాఫ్ట్‌వేర్ ఉపయోగించారంటున్నారు. ఇక్కడి వరకు నార్మల్‌గానే ఉంది. కానీ ఖతార్, టర్కీ దేశాలు వీటన్నింటి వెనక ఉన్నాయనేది ఇప్పుడు నెతన్యాహు పార్టీ చేస్తున్న పెద్ద అలిగేషన్. ఇజ్రాయెల్‌లో ఇస్లామ్‌ను వ్యాప్తి చేయాలని చూస్తున్నారంటూ ఆరోపిస్తోంది ఆ పార్టీ. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నికల కమిటీకి కంప్లైంట్ చేసింది కూడా.
ఏదైనా పొలిటికల్ డ్రామానా?
ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం లైట్ తీసుకోలేదు. షిన్ బెట్.. అంటే ఇజ్రాయెల్‌లో మన సీబీఐ లాంటి ఏజెన్సీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. షిన్ బెట్ దగ్గర కూడా ఏదో సమాచారం ఉందని ప్రచారం జరుగుతోంది. బట్ దానిని బయటికి మాత్రం రిలీజ్ చేయలేదు. సో.. సమ్‌థింగ్ ఈస్ ఫిషీ అనే డౌట్స్ అయితే బలపడేలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. మరి ఇది నిజంగా నిజమా? లేక ఏదైనా పొలిటికల్ డ్రామానా? అనేది తేలాల్సి ఉంది.
Also Read: మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!
ఆరోపణలపై ఖతార్ రియాక్ట్
బట్ ఈ ఆరోపణలపై ఇప్పటికే ఖతార్ రియాక్ట్ అయ్యింది. వీటిని ఖండించింది కూడా. తమను బలి పశువు చేయొద్దంటూ చాలా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది. తమను కావాలనే ఈ వ్యవహారంలోకి లాగుతున్నారంటూ విమర్శించింది. ముందేమో నెతన్యాహును తమ వైపుకు లాక్కున్నామని ప్రచారం చేశారు.. ఇప్పుడేమో.. ఏకంగా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నామంటున్నారు.. డబ్బులు పంచామంటున్నారు.. ఇదేక్కడి పంచాయితీ అంటూ కౌంటర్ ఇచ్చింది. టర్కీది కూడా ఇదే మాట.
అరబ్ లీడర్ల మాట..
ఖతార్, టర్కీలే కాదు.. ఇజ్రాయెల్ విపక్ష నేతలు కూడా వీటిని ఖండిస్తున్నారు. నెతన్యాహు ఓటమి భయంతోనే ఈ డ్రామాను చేస్తున్నారంటున్నారు అపోజిషన్ లీడర్ గాడి ఐసెన్‌కోట్. ఓటమిని అంగీకరించలేక మాపై జాతి వివక్షతో కూడిన నిందలు వేస్తున్నారనేది అరబ్ లీడర్ల మాట.
షిన్ బెట్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలుస్తుంది?
ఇలాంటి టైమ్‌లో షిన్ బెట్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలుస్తుంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. వీటన్నింటి కంటే.. ఇప్పుడు అందరి ముందున్న అసలు ప్రశ్న ఏంటంటే.. అసలు ఇజ్రాయెల్‌లో గవర్నమెంట్‌ను ఫామ్ చేసేది ఎవరు? నెతన్యాహూ తనకు అవసరమైన మరో 8 మంది సపోర్ట్‌ను ఎలా సాధిస్తారు..? లేక ఐసెన్‌కోట్ అరబ్ పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?. వీటికి సమాధానాలు రావాలి. ఒకవేళ ఏ కూటమికీ మెజారిటీ రాకపోతే ఈ పొలిటికల్ డైలమా కంటిన్యూ అవ్వొచ్చు.. ఇక పరిస్థితులు అనుకూలించకపోతే మరో ఎన్నికకు వెళ్లే అవకాశమూ ఉంటుంది. ఇవన్నీ తేలే వరకు.. అసలైన అధికార పోరుకు తెర పడే చాన్సే లేదు.