Indian Bullet Train Features: భారతీయ రైల్వేలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలోనే తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపై పరుగులు పెట్టనుంది. B28 పేరుతో రూపొందుతున్న ఈ హైస్పీడ్ రైలు ఇప్పటికే భద్రతా పరీక్షల్లో కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరులోని BEML తయారీ కేంద్రంలో రైలు బాడీకి సంబంధించిన స్క్వీజ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ రైలును BEML తయారు చేస్తోంది. తొలి రెండు రైళ్లలో ఒక్కో రైలుకు ఎనిమిది కోచ్‌లు ఉండనున్నాయి. 2027 మే-జూన్ నాటికి సూరత్-వాపి మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బుల్లెట్ రైలులో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందించనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
1.ఈ రైలును గంటకు గరిష్ఠంగా 280 కిలోమీటర్ల వేగంతో రూపొందించారు. ఆపరేషనల్ వేగం గంటకు 249 కిలోమీటర్లు.
2.రైలు మొత్తం పొడవు సుమారు 202 మీటర్లు.
3.ఎనిమిది కోచ్‌లలో నాలుగు మోటార్ కోచ్‌లు, నాలుగు ట్రైలర్ కోచ్‌లు ఉంటాయి.
4.మొత్తం 557 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది.
5.ఏడు కోచ్‌లలో స్టాండర్డ్ క్లాస్, ఒక కోచ్‌లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీటింగ్ ఉంటుంది.
6.దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక స్థలంతో పాటు బ్రెయిల్ లిపిలో సూచికలు ఏర్పాటు చేస్తారు.
8.భవిష్యత్తులో రెండు ఎనిమిది కోచ్‌ల రైళ్లను కలిపి 16 కోచ్‌లుగా నడిపే అవకాశం ఉంది.
9.ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట తగ్గేలా కాళ్లు చాపుకునే సౌకర్యంతో సీట్లు రూపొందించారు.
10.రైలు లోపల LED లైటింగ్ ఏర్పాటు చేస్తారు.
11.చిన్న బ్యాగుల కోసం పైభాగంలో లగేజ్ ర్యాక్‌లు ఉంటాయి.
12.పెద్ద సూట్‌కేసుల కోసం ప్రత్యేక లగేజ్ స్టాండ్లు అందుబాటులో ఉంటాయి.
13.మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఛార్జింగ్ కోసం పవర్ అవుట్‌లెట్లు ఉంటాయి.
14.ఆధునిక బయో డైజెస్టర్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు.
15.పెద్ద కిటికీల ద్వారా ప్రయాణికులు బయట దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
16.కోచ్‌ల మధ్య సీల్ చేసిన గ్యాంగ్‌వేలు ఉండటంతో ఒక బోగీ నుంచి మరో బోగీకి సులభంగా వెళ్లవచ్చు.
17.LCD స్క్రీన్లపై ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో సమాచారం అందిస్తారు. పబ్లిక్ అడ్రస్, ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థలు ఉంటాయి.
18.అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందితో మాట్లాడేందుకు టాక్‌బ్యాక్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
19.Wi-Fi ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ద్వారా వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.
20.HVAC ఎయిర్ కండిషనింగ్, సౌండ్ ఫ్రూఫ్ కంట్రోల్ వ్యవస్థలు, రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు.
అహ్మదాబాద్-ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్‌లోని సూరత్-వాపి మధ్య 100 కిలోమీటర్ల మార్గంలో 2027 మే-జూన్ నాటికి ట్రయల్ రన్స్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మార్గంలో కమర్షియల్ సర్వీసులు 2027 ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ బుల్లెట్ రైలు భారత రైల్వే రంగంలో కీలక ముందడుగు కానుంది.
Read Also: ఇక విదేశాల్లోనూ వందే భారత్ పరుగులు.. రైల్వేమంత్రి సంచలన ప్రకటన!