Vijay Devarakonda: పులితో తాడాట ఆడితే ఎట్టా ఉంటాదో తెలుసా? పాములతో సయ్యాట ఆడితుంటే ఎట్టా ఉంటాదో తెలుసా? పులిబిడ్డకు పాలు పట్టిస్తుంటే ఎట్టా ఉంటాదో తెలుసా? భారీ ఆకారం ఉన్న జంతువులతో ఫన్నీగా ఉంటే ఎట్టా ఉంటాదో తెలుసా? ఇవన్నీ ఎట్టా ఉంటాయో తెలియాలంటే విజయ్ దేవరకొండను అడగాల్సిందే. ఎందుకంటే ఈ సాహసాలన్నీ చేసింది మన రౌడీ హీరోనే.
అవును, హీరో విజయ్ ఈమధ్య దుబాయ్ టూర్ వేశారు. ఫ్యామిలీతో కొన్నాళ్లు సరదాగా గడిపారు. దుబాయ్ లో ఓ యానిమల్ పార్క్ లో తెగ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదిప్పుడు నెట్లో తెగ వైరల్ అవుతోంది. వేలాదిగా లైక్లు, షేర్లు వస్తున్నాయి.
“జీవితంలో మరో అందమైన జ్ఞాపకం. ఈ పార్కులో వాళ్లు నాకు పాములంటే ఉన్న భయాన్ని పోగొట్టారు. జంతువుల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అందమైన సింహం, పులి పిల్లలతో ఆడుకోవడానికి అవకాశం ఇచ్చారు” అని రాసుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇక విజయ్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే గూస్ బంప్సే. విహార యాత్ర కాస్తా.. సాహస యాత్రగా సాగినట్టుంది. ఓ పులితో విజయ్ అండ్ టీమ్ ఆడిన తాడాట మాత్రం ఆ వీడియోకే హైలైట్. ఓ వైపు విజయ్ తో పాటు మరో ఇద్దరు.. మరోవైపు సింగం సింగిల్ గా. ఇక టగ్ ఆఫ్ వార్ మొదలు. ముగ్గురు కలిసి తాడును బలంగా లాగుతున్నా.. పులి పిల్ల మాత్రం అంగుళం కూడా కదలడం లేదు. కండలు తిరిగిన లైగర్ కూడా.. టైగర్ ముందు పిల్లి అయిపోయాడు. ఆ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక పెద్ద పెద్ద కొండచిలువలతో ఆడుకోవడం.. కోతులకు, పక్షులకు ఆహారం తినిపించడం.. ఇలాంటి సరదా సరదా సీన్లు అనేకం ఉన్నాయి విజయ్ షేర్ చేసిన వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేసేయండి….
?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noreferrer noopener">
?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noreferrer noopener"> ?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noreferrer noopener">
?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noreferrer noopener">View this post on Instagram
?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noreferrer noopener">A post shared by Vijay Deverakonda (@thedeverakonda)