E-Paper
Advertisement

RevanthReddy: ప్రగతి భవన్ కూల్చుతాం.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.. రేవంత్ ఆన్ ఫైర్

RevanthReddy: ప్రగతి భవన్ కూల్చుతాం.. కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.. రేవంత్ ఆన్ ఫైర్
Advertisement

RevanthReddy: ప్రగతి భవన్ గోడలు కూల్చుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు, పార్టీ ఫిరాయింపులకు ప్రగతిభవన్‌ అడ్డాగా మారిందని మండిపడ్డారు.

రాజ్యాలను కూల్చి, రాచరికాన్ని బొందపెట్టిన ఘనత తెలంగాణ పౌరుషానిదని రేవంత్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టాలని తన దగ్గర బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి.. కొత్త సంవత్సరంలో ప్రగతి భవన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.

Advertisement

ప్రగతి భవన్ అనే గడిలోకి సామాన్యులకు ఎందుకు ప్రవేశం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని ఆరోపించారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు రేవంత్.

“తెలంగాణలో ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు.. 8వ తారీఖు వచ్చినా జీతాలు లేవు.. అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారు.. నకిలీ విత్తనాలతో రైతులను మోసగించిన వారిపై పీడీ యాక్ట్‌ ఎందుకు పెట్టరు? జనవరి 1, 2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తాం.. భూ నిర్వాసితులకు పరిహార బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుంది.. పోలీసు ఉద్యోగులకు వారంలో ఒక రోజు సెలవు కల్పిస్తాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

హాథ్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్ర 3వ రోజు పెనుగొండ నుంచి ఈదులపూసపల్లి, మహబూబాబాద్‌ వరకు సాగింది. పాదయాత్రలో ప్రజలు తనతో ఎన్నో సమస్యలు చెప్పుకున్నారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×