BigTV English

Kamala Harris: అబార్షన్ల విషయంలో మా నిర్ణయం ఇదే..: ప్రచారసభలో కమలా హారిస్

Kamala Harris: అబార్షన్ల విషయంలో మా నిర్ణయం ఇదే..: ప్రచారసభలో కమలా హారిస్

Vice President Kamala Harris Speaks in Wisconsin: అబార్షన్లపై నిషేధం విధించాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను మేం అడ్డుకుంటామంటూ కమలా హారీస్ పేర్కోన్నారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు.


‘పెద్ద పెద్ద సంస్థలు, బిలియనీర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆధారపడుతున్నాడు. ప్రచారం కోసం సహాయం చేయాలంటూ వారితో బేరసారాలు జరుపుతున్నాడు. తన ప్రచారానికి విరాళాలు ఇచ్చినవారికే చమురు కంపెనీలు ఇస్తామంటూ హామీ ఇస్తున్నాడు. కానీ, మా డెమోక్రటిక్ పార్టీ అలా కాదు. మేం ప్రజాశక్తితో ప్రచారం నిర్వహిస్తున్నాం. అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే మాకు కేవలం 24 గంటల్లోనే భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ఇది కేవలం ప్రజల మద్దతుతోనే సాధ్యమయ్యింది. ప్రజా ప్రయోజనాలే మా ఎజెండా.. ఆ దిశగానే మా పాలన ఉంటుంది.

Also Read: మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ టాప్‌లో సింగపూర్, మరి ఇండియా ?


అమెరికా దేశాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. కానీ, మేం ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వబోం. భవిష్యత్ తరాల కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతాం. అమెరికన్లు తుపాకీ హింస భయాలు లేకుండా స్వేచ్ఛగా జీవించగలగాలి. మాతృత్వపు స్వేచ్ఛను మా పార్టీ గౌరవిస్తుంది. తమ శరీరాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉంది. వారేం చేయాలనేది చెప్పే హక్కు ప్రభుత్వానికి ఉండదు. అబార్షన్లపై నిషేధం విధించాలంటున్న డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని మేం ఖండిస్తున్నాం. ఆయన ఆలోచనను మేం అడ్డుకుంటాం’ అంటూ పేర్కొన్న కమలా హరీస్.. పోరాడినప్పుడే విజయం దక్కుతుందని ఆమె చెప్పారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ దాదాపుగా ఖరారైనట్లేనంటూ వార్తలు వస్తున్నాయి. పార్టీలో మెజారిటీ నేతలు ఆమెకు మద్దతు తెలపడంతో, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయంటూ అందులో పేర్కొంటున్నారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొని పై విధంగా మాట్లాడారు.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×