BigTV English

january first : జనవరి ఒకటినే వేడుకలు ఎందుకు? దానివెనుక ఉన్న కథేంటో తెలుసా?

january first : జనవరి ఒకటినే వేడుకలు ఎందుకు? దానివెనుక ఉన్న కథేంటో తెలుసా?

january first : జనవరి 1 వస్తున్నదంటే అత్యధిక దేశాల్లో ఒకటే జోష్. డిసెంబర్ 31 రాత్రి ఎటు చూసినా సందడే. అర్థరాత్రి దాటిన వెంటనే కేరింతలతో నగరాలన్నీ హోరెత్తిపోతాయి. పరసర్పం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోతారు. కొత్త ఏడాదిని స్వాగతిస్తూ చేపట్టే సంబురాలు అంబరాన్ని చుంబిస్తాయి. న్యూ ఇయర్‌లో అంతా మంచే జరగాలని కోరుకుంటుంటారు.


పాత ఏడాదిలో ఎదురైన చేదు అనుభవాలు, చెడు స్మృతులకు స్వస్తి పలుకుతూ.. నూతన ఏడాదికి ఆహ్వానం పలుకుతుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతుంటారు. మరి కేలండర్‌లో 12 నెలలు, 365 రోజులు ఉండగా జనవరి ఒకటవ తేదీనే ఎందుకీ వేడుకలు జరుపుకుంటారు? దాని వెనుక ఉన్నఆసక్తికర విశేషాలేమిటో తెలుసుకుందామా?

క్రీస్తుపూర్వం 2 వేల నుంచి అంటే.. 4 వేల ఏళ్ల క్రితమే నూతన సంవత్సరం నిర్వహించుకున్న దాఖలాలున్నాయి. అప్పట్లో జనవరి నెల అనేదే లేదు. ఏటా మార్చి నెలలో వసంత కాలం ఆరంభమైన నాటి నుంచే కొత్త ఏడాదిగా పరిగణించేవారు. రోమ్ కేలండర్‌లో పది నెలలే ఉండేవి. మార్చి తొలి నెలగా ఉండటంతో అప్పట్లో మార్చి ఒకటినే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు.


క్రీస్తుపూర్వం 700‌లో రోమ్ రెండో చక్రవర్తి నుమా పొంటియస్.. అప్పటికే ఉన్న రోమ్ కేలండర్‌కు జనవరి, ఫిబ్రవరి నెలలను జత చేశారు. 12 నెలల కేలండర్‌ను రూపొందించారు. జనవరి 1ని ప్రాతిపదికగా చేసుకుని అధికారులు, ప్రజాప్రతినిధుల పదవీ కాలాన్ని లెక్కించేవారు. అయితే నూతన సంవత్సరం వేడుకలను మాత్రం మార్చి ఒకటవ తేదీనే నిర్వహించేవారు.

క్రీస్తుపూర్వం 153వ సంవత్సరంలో తొలిసారిగా జనవరి 1న న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకున్నారు రోమన్లు. అయితే కొత్త ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్న ఉదయించింది. సూర్యచంద్రుల గమనంతో అప్పటి కేలండర్ తేదీలు సరితూగకపోవడంతో జూలియస్ సీజర్ ఆ లెక్కలను సరిచేశారు. క్రీ.పూ.45లో జూలియన్ కేలండర్‌ను ప్రవేశపెట్టారు.

అయితే ఈ కేలండర్‌ను రూపొందించాక.. సంవత్సరం మొదలుపెట్టాల్సి రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. రోమన్లకు ముఖ్యమైన దేవత జనస్ పేరు మీదుగా జనవరిని సీజర్ ఎంచుకున్నాడు. రోమన్లు జనస్‌ను గాడ్ ఆఫ్ బిగినింగ్స్‌గా భావిస్తారు. అందుకే కొత్త ఏడాది ప్రారంభానికి జనవరి నెలను ఎంచుకున్నారు.

ఆ తర్వాత రోమన్ల సామ్రాజ్య విస్తరణతో పాటే ఆ కేలండర్ కూడా మిగిలిన దేశాలకు వ్యాప్తి చెందింది. క్రీస్తుశకం వచ్చాక యూరప్‌లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 5వ శతాబ్దంతో రోమన్ల సామ్రాజ్యం అంతరించింది. క్రీ.శ.567 నుంచి క్రైస్తవ ప్రభావం పెరిగింది. జనవరి 1ని అన్యమత సంప్రదాయంగా క్రైస్తవులు భావించారు.

దాంతో మార్చి 25న కొత్త ఏడాదిగా జరపాలని క్రైస్తవ దేశాలన్నీ నిర్ణయించాయి. ఎందుకంటే మేరీకి దేవదూత గాబ్రియల్ కనిపించిన తేదీగా దీనికి గుర్తింపు ఉంది. ఏసుక్రీస్తు క్రిస్మస్ రోజున జన్మించినప్పటికీ.. నూతన అవతారానికి జన్మనివ్వబోతున్నట్టు సందేశం అందింది మాత్రం మార్చి 25నే అని వారు భావించారు.

చాలా కాలం పాటు క్రైస్తవులు మార్చి 25నే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అయితే జూలియన్ కేలండర్‌లో లోపాలు ఎన్నింటినో పోప్ గ్రెగరీ-13 గుర్తించారు. మార్పుచేర్పులు చేసి 1582లో గ్రెగోరియన్ కేలండర్‌కు రూపకల్పన చేశారు. అది ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ దానినే అనుసరించాయి. ఆ కేలండ‌ర్ ప్రకారం జనవరి ఒకటవ తేదీనే నూతన సంవత్సర వేడుకలు ఆరంభించడం మొదలుపెట్టాయి.

కానీ ప్రొటెస్టెంట్ వర్గానికి చెందిన ఇంగ్లండ్ దేశస్తులు మాత్రం 1752 వరకు మార్చి 25‌నే కొత్త ఏడాదిని జరుపుకున్నారు. కాలక్రమంలో ప్రపంచ దేశాలు, బ్రిటన్‌ మధ్య తేదీల్లో తేడాలు రావడం, వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదురు కావడంతో 1752లో బ్రిటన్‌ సామ్రాజ్యం కూడా గ్రెగోరియన్‌ కేలండర్‌ను పార్లమెంట్ చట్టం ద్వారా అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు చాలా దేశాలు గ్రెగోరియన్ కేలండర్‌ను అనుసరిస్తున్నాయి. దాని ప్రకారమే జనవరి 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకుంటున్నారు.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×