BigTV English

Prabhas: ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న మెగా హీరో..!!

Prabhas: ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న మెగా హీరో..!!

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘కల్కి’ ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ప్రభాస్ కంటే ముందుగా ఈ మూవీ స్టోరీ మరో టాలీవుడ్‌ స్టార్ హీరో దగ్గరకి వెళ్లిందట. అయితే కొన్ని కారణాల చేత అది క్యాన్సిల్ అయి ప్రభాస్ వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మరి ఈ అవకాశం వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకుందాం..


పీరియాడిక్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీమహావిష్ణువుగా 11వ అవతారం కల్కి 2898వ సంవత్సరంలో ఉంటారని టాక్. కొన్ని కారణాలవల్ల సైంటిస్టులు అతడిని ప్రస్తుత కాలంలోకి తీసుకువస్తారని.. ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు-kగా ఉంటుందని సినీ వర్గాల సమాచారం. ఇక ఈ చిత్రంలో దిశాపటాని, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ నటిస్తుండటంతో హైప్ ఏర్పడింది. ఆ హైప్‌కి తగ్గట్టుగా ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం అంతా ఎదురుచూస్తుండగా.. ఓ వార్త సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.

మొదటగా ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్‌ని అనుకున్నారట. ఎప్పుడో ఆరేళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ స్టోరీని రామ్ చరణ్‌కు వినిపించారట. అయితే ఆ స్టోరీ అద్భుతంగా ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే ఇలాంటి పెద్ద సినిమా చేయగలరా లేదా అనే విషయం పైన రామ్ చరణ్‌కు సందేహం ఉండేదట. దీంతో ఓ రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత వస్తే కచ్చితంగా ఈ సినిమా చేద్దామని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది.


ఆ తర్వాత ఇదే స్టోరీని నాగ్ అశ్విన్.. ప్రభాస్‌కు వినిపించగా.. అతడు వెంటనే ఒకే చెప్పేశాడట. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో కమలహాసన్ షూటింగ్ పార్ట్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు సమాచారం.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×