E-Paper
Advertisement

KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్

KTR: ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలి.. అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లుకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్
Advertisement

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి పార్టీలో చేరుతున్న వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించిన అభ్యర్థులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో సాగు సమయానికి ముందే రైతుల ఖాతాల్లో ‘రైతు బంధు’ డబ్బులు జమ అయ్యేవని, కానీ నేడు రైతులు ఆ సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘రైతు బంధు’ను నిలిపివేసి, కొత్తగా ‘రాహుల్ బంధు’ అనే పథకాన్ని అమలు చేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి ఏడాదికి వెయ్యి కోట్లు రాహుల్ గాంధీకి పంపించి, తన పదవిని కాపాడుకోవడమే రేవంత్ లక్ష్యమని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమేనా అని ఆయన ప్రశ్నించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వికలాంగుల ఇళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు మరియు ఆయన సోదరుడి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

Advertisement

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కేటీఆర్ సెటైర్లు వేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు కావస్తున్నా అతీగతీ లేదని విమర్శించారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం, రైతులకు పంట బోనస్, మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని చెబుతూనే, లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటని అడిగారు. 40 లక్షల మంది వృద్ధులు రూ. 4 వేల పెన్షన్ కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమం కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ తరపున ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల పొట్ట కొడుతున్న ఈ ‘రాబందు’ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలన కోసం వేచి చూస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజా పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Read Also: Telangana BJP: కంచుకోట కల.. కమలంలో గుబులు.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది?

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×