
work hours : యువత వారానికి 70 గంటలు పనిచేస్తే.. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలుస్తుందనేది ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా పనిగంటల వివరాలను అవలోకిస్తే ఆసక్తికర అంశాలు బయటపడతాయి. ఇవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి.
వారంలో సగటున అత్యధిక పనిగంటలు ఉన్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను చెప్పుకోవచ్చు. అక్కడ అత్యధికంగా వారానికి సగటున 52.6 పనిగంటలు ఉంటే.. గాంబియాలో 50.8, భూటాన్ 50.7, లెసోథో 49.8, కాంగోలో 48.6 పనిగంటలు ఉన్నాయి.
ఇక వారంలో అతి తక్కువగా వాన్వాటూ దేశంలో వారానికి సగటున 24.7 పనిగంటలు అమల్లో ఉన్నాయి. కిరిబాటిలో 27.3 పనిగంటలు, మొజాంబిక్ 28.6, రువాండాలో 28.8, ఆస్ట్రియాలో 29.5 గంటలు పనిచేస్తారు.
అదేన్ వర్కర్ సగటున వారానికి 36.4 గంటలు పనిచేస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణ కొరియా(37.9 గంటలు), చైనా(46.1), రష్యా(37.8), ఇండియా(47.7)తో పోలిస్తే తక్కువే.
అయితే బ్రిటన్(35.9 గంటలు), ఇజ్రాయెల్(35.4), కెనడా(32.1), నార్వే(33.5)తో పోలిస్తే మాత్రం అమెరికాలో పనిగంటలు ఎక్కువే. యూరోపియన్ యూనియన్ సగటు పనిగంటలు 30.2 కన్నా కూడా అగ్రరాజ్యంలో ఎక్కువ పని గంటలు ఉండటం విశేషం.