Actresses: గతంలో జరిగిన కొన్ని ఘటనలు కొంతకాలం పాటు వెంటాడుతూనే ఉంటాయి. అలానే కొన్ని సంవత్సరాలు పాటు కోర్టులలో వాయిదాలు పడుతూనే ఉంటాయి. చరిత్రలో ఎన్నో కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలానే దాదాపు ఏడేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలా జరిగింది ఒక సామాన్యమైన స్త్రీకి కాదు, ఒక సెలబ్రిటీకి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఆ హీరోయిన్. 2017లో కార్లో వెళుతున్న ఆమెపై ఏడుగురు వ్యక్తులు లైంగిక దాడి చేశారు. అప్పట్లో ఈ కేసు ఒక సంచలనంగా మారింది. అయితే ఇప్పటికీ ఈ కేసు ఒక సంచలనమని చెప్పాలి. మొదట ఇది జరిగినప్పుడు మలయాళం ఇండస్ట్రీ అంతా కూడా ఒకసారిగా షేక్ అయింది.
మలయాళం ఇండస్ట్రీలో చాలామంది పెద్దపెద్ద నటులు ఈ కేసు గురించి మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరగాలి. ఇలాంటి సంఘటనలు జరగడం అనేది బాధాకరమని చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు కొంతమంది నటులు. అయితే కొన్ని రోజులు తర్వాత ఈ ఇష్యూ గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది కాదని, చాలా ప్లాన్ ప్రకారం కావాలని చేశారు అని చాలామందికి క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా కారులో ఉన్న డ్రైవర్ ను బయటకు లాగి. దాదాపు మూడు గంటల పాటు ఆ ఏడుగురు వ్యక్తులు వేధించారు. బాధితురాలు త్రిసూర్ నుంచి కొచ్చికి ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి పూట ఆమె ప్రయాణిస్తున్న కారును వ్యాన్‌తో ఢీ కొట్టారు. ఆ తరువాత డ్రైవర్‌ను లాగేసి బలవంతంగా కారులోకి చొరబడ్డారు. కారులో తిప్పుతూ సుమారు మూడు గంటలపాటు లైంగిక దాడి చేశారు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు తీశారు. చివరకు కొచ్చిలోని ఒక ప్రాంతంలో ఆమెను వదిలేసి దుండగులు పారిపోయారు. మళయాళం, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఒక సెలబ్రిటీ కి అలా జరగడం అనేది జీర్ణించుకోలేని విషయం. అయితే వాళ్లను గుర్తుపట్టే ప్రయత్నం బాధితురాలు చేసినా కూడా ముఖాలకి ముసుగులు ఉండడంతో గమనించలేకపోయింది. కానీ ఎట్టకేలకు ఒక వ్యక్తిని మాత్రం గుర్తు పట్టింది. ఆ వ్యక్తికి మలయాళం ఇండస్ట్రీలో చాలా పెద్ద సర్కిల్ ఉంది. చాలామంది సెలబ్రిటీలకు డ్రైవర్లను సప్లై చేస్తాడు. తను కూడా ఒక డ్రైవర్.
ఇక ఈ కేసులో వెనక ఎవరు ఉన్నారని కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఎవరైతే ఈమెకు సపోర్ట్ గా మాట్లాడారో.. వాళ్లే ఈ కేసులో కీలకంగా ఉండటం అనేది ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఆమె మొహం కనిపించేటట్లు వీడియో తీయండి అని చెప్పాడు ఆ వ్యక్తి అని చాలా వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా చార్జ్ తీసుకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తి బయటికి వచ్చేసాడు. ఆ బయటకు వచ్చిన తరుణంలో బాధితురాలు భావోద్వేగానికి గురై సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ రాసుకు వచ్చారు.
బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్దతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అని అప్పట్లో ఆమె తెలిపారు. ఏదేమైనా ఒక స్థాయిలో ఉన్న, మంచి గుర్తింపు ఉన్న ఒక స్త్రీకి ఇలా జరగడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. అయితే.. ఆ నటికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె ఆ చేదు ఘటనను తలచుకుంటూ కుమిలిపోకుండా.. ధైర్యంగా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు.