BIS Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీఎస్సీ, బీటెక్, బీఈ, బీఎన్‌వైఎస్, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. బ్యూరో ఆఫ్ ఇండయన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం.
ఢిల్లీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కాంట్రాక్ట్ విధానంలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 9 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 160
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కన్సల్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
కన్సల్టెంట్ ఉద్యోగాలు: 160
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 19
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 9
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్, బీఈ, బీఎన్‌వైఎస్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అర్హత ఉన్న వారు అందరూ దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: 65 ఏళ్లు మించరాదు.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.75 వేల జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bis.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
వెకెన్సీల సంఖ్య: 160
అప్లికేషన్ కు చివరి తేది: మే 9
విద్యార్హత: బీటెక్, బీఈ, బీఎన్‌వైఎస్, మాస్టర్స్ డిగ్రీ
Also Read: CSIR-NGRI: ఇంటర్ పాసైతే చాలు.. మన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం.. జీతమైతే నెలకు రూ. రూ.38,483