CSIR-NGRI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఉత్తమ అవకాశం. టైపింగ్ స్కిల్స్, ఇంటర్ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. సీఎస్‌ఐఆర్ – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (NGRI) లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబందించి పూర్తి సమాచారాన్ని క్లారిటీ తెలుసుకుందాం.
హైదరాబాద్, CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 5 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: Inter Results: అలెర్ట్..! ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే..?
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 11
CSIR – నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు- ఖాళీల వివరాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్): 08
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్): 01
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ & పీ): 02
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 05
విద్యార్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి వచ్చి ఉండాలి.
వయస్సు: 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులక మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు రూ.38,483 వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: www.ngri.res.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. హైదరాబాద్ లో ఉద్యోగం అవకాశం వచ్చింది. మళ్లీ అది కూడా ప్రభుత్వ ఉద్యోగం. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు రూ.38,483 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 11
దరఖాస్తుకు చివరి తేది: మే 5
విద్యార్హత: ఇంటర్ పాస్, టైపింగ్ స్కిల్స్