RRB Recruitment: గవర్నమెంట్ కొలువు సాధించాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన గడువు తేదిని ఫిబ్రవరి 16 వరకు పొడగించారు. ముందుగా ఫిబ్రవరి 6న దరఖాస్తు గడువు తేదిగా ప్రకటించారు. అయితే, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్థులు సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు గడువును ఫిబ్రవరి 16 వరకు పొడిగించింది.
ఆర్‌ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు rrbapply.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మంచి అవకాశం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1036
ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ – 187(ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య ఉండాలి.)
సైంటిఫిక్ సూపర్ వైజర్- 3 (ఈ ఉద్యోగానికి వయస్సు 18 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి)
ట్రైన్‌డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 338(18 నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.)
ఛీఫ్ లా అసిస్టెంట్- 54 (18 నుంచి 43 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి)
పబ్లిక్ ప్రాసిక్యుటర్ – 20 (18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి)
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రంక్టర్- 18(18-48 వయస్సు)
సైంటిఫిక్ అసిస్టెంట్ -02 (18-38 వయస్సు)
జూనియర్ ట్రాన్స్ లేటర్(హిందీ)- 130 (18-36 వయస్సు)
సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్- 03 (18-36 వయస్సు)
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్- 59 (18 నుంచి 36 వయస్సు)
లైబ్రేరియన్ -10 (18 నుంచి 33 వయస్సు)
మ్యూజిక్ టీచర్(మహిళ)- 03 (18 నుంచి 48)
ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ – 188(18 నుంచి 48)
అసిస్టెంట్ టీచర్(మహిళ- జూనియర్ స్కూల్)- 02 (18 నుంచి 48)
లాబొరేటరి అసిస్టెంట్/స్కూల్- 07 (18 నుంచి 48 వయస్సు)
ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3- 12(18-33 వయస్సు)
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, మహిళ అభ్యర్థులకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.)
ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసేందుకు పేమెంట్ 2025 జనవరి 7 నుంచి చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 6
విద్యార్హత: బీఈడీ, ఎల్ఎల్‌బీ, బీపీఈడీ, బీఎల్ఈడ్, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎడ్, మాస్టర్ డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి రూ.19000 నుంచి రూ.48000 వరకు వేతన ఉంది.
పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in
అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇది సువర్ణవకాశం. అప్లికేషన్ కు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి మంచి అవకాశం మళ్లీ రాదు. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.