BigTV English

Aghathiyaa: కష్టపడేవాడు పేరు సృష్టించలేడు.. ఇంట్రెస్టింగ్‌గా జీవా ‘అగత్యా’ ట్రైలర్..!

Aghathiyaa: కష్టపడేవాడు పేరు సృష్టించలేడు.. ఇంట్రెస్టింగ్‌గా జీవా ‘అగత్యా’ ట్రైలర్..!

Aghathiyaa.. ప్రముఖ యంగ్ హీరో జీవా (Jeeva) , స్టార్ హీరో అర్జున్ సర్జ(Arjun Sarja) హీరోలుగా, రాశీ ఖన్నా(Rashi khanna) హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం అగత్యా (Aghathiyaa) . ప్రముఖ పాటల రచయిత పా. విజయ్(Pa .Vijay) కథ అందించడంతోపాటు దర్శకత్వం కూడా వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకం పై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కాబోతోంది. జనవరి 31వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాలవల్ల ఫిబ్రవరి 28 కి విడుదల వాయిదా వేశారు. హార్రర్ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా మన సంస్కృతి అనుబంధాలను బలంగా చూపించారు. ఇకపోతే అద్భుతమైన సీజీ వర్క్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. వీ ఎఫ్ ఎక్స్ కోసమే మరికొంత టైం కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశామంటూ ఇటీవల చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసింది.


ఇంట్రెస్టింగ్ సాగిన అగత్యా ట్రైలర్..

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ట్రైలర వైజాగ్ బీచ్ తో ప్రారంభం అయింది. ఆ తర్వాత హార్రర్ బిజిఎంతో ట్రైలర్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. “సుమారుగా 120 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆత్మలను మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారు ” అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అందులో జీవా, రాశి ఖన్నా ఏదో వెతుకుతున్నట్టు మనకు చూపించారు. రాశిఖన్నా అర్జున్ తో మాట్లాడుతూ..” నేను ఫ్రాన్స్ లో ఆర్ట్స్ గురించి చదువుకున్నప్పుడు, దీనిని ఒక ప్రాజెక్టుగా వర్క్ చేశాను. ఫారిన్ లో ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అయింది”. అంటూ తెలుపుతుంది. ఆ తర్వాత స్పిరిట్స్ చూపిస్తూ కాస్త హారర్ గా ట్రైలర్ను కొనసాగించారు. ఈ ఆత్మలు మనుషుల ద్వారా మనకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి. అంటూ డైలాగ్స్ వినిపిస్తాయి. ఇక ఇందులో అర్జున్ సిద్ధ వైద్య పరిశోధకుడిగా సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక ఇందులో రాజులు, మహారాణులు బ్రిటిష్ కాలం నాటి పరిపాలనను కూడా చూపించారు. ముఖ్యంగా “కష్టపడేవారు హిస్టరీలో చోటు సంపాదించుకోలేడు. పేరు సంపాదించిన వాడికే అందులో చోటు ఉంది” అంటూ బ్రిటిష్ రాజు చెప్పిన డైలాగ్ ను ఇక్కడ హైలెట్ చేశారు. మొత్తానికైతే ఆత్మల చుట్టూ ఈ సినిమా సాగుతోందని తెలుస్తోంది. ఇక చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ తోనే అంచనాలు పెంచేశారు. ఇక భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 28వ తేదీన రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.


కం బ్యాక్ ఇవ్వనున్న రాశీ ఖన్నా..

ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, ఇప్పుడు చాలా కాలం తర్వాత అగత్యా సినిమాతో గట్టి కం బ్యాక్ ఇవ్వబోతోంది. ఈ సినిమాతో కచ్చితంగా మళ్ళీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తాయనటంలో సందేహం లేదు. ఇందులో ఆర్ట్స్ స్టూడెంట్ వీణా పాత్రలో కనిపించనుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×