E-Paper
Advertisement

HURL Recruitment: హెచ్‌యూఆర్ఎల్ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ జాబ్ వస్తే రూ.లక్షల్లో జీతాలు, కాకపోతే రేపే లాస్ట్ డేట్

HURL Recruitment: హెచ్‌యూఆర్ఎల్ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ జాబ్ వస్తే రూ.లక్షల్లో జీతాలు, కాకపోతే రేపే లాస్ట్ డేట్

HURL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. హిందుస్థాన్‌ ఉర్వక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్ఎల్) లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి. సెలెక్ట్ రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

హిందుస్థాన్‌ ఉర్వక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (HURL) లో వివిధ విభాగాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 6న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఆన్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108

హిందుస్థాన్‌ ఉర్వక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్, ఇంజినీర్ / సీనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ / డిప్యూటీ మేనేజర్, అడిషనల్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్- 2 – గ్రేడ్ -2 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

⦿ మేనేజర్‌: 03
⦿ ఇంజినీర్‌/సీనియర్‌ ఇంజినీర్‌: 35
⦿ అసిస్టెంట్ మేనేజర్‌/డిప్యూటీ మేనేజర్‌: 21
⦿ అడిషనల్ చీఫ్‌ మేనేజర్‌: 01
⦿ సీనియర్‌ మేనేజర్‌: 01
⦿ జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్-2-గ్రేడ్‌-2: 47

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 15

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 6

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్-2-గ్రేడ్‌-2కు 30 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు, అడిషనల్ చీఫ్‌ మేనేజర్‌కు 44 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు, డిప్యూటీజీ మేనేజర్‌కు 37 ఏళ్లు, సీనియర్‌ ఇంజినీర్‌కు 32 ఏళ్లు, మేనేజర్‌కు 40 ఏళ్లు వయస్సు మించరాదు.

నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగం ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు మేనేజర్‌కు రూ.70,000 – రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000 – రూ.1,80,000, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000 – రూ.1,60,000, సీనియర్ ఇంజినీర్‌కు రూ.45,000 – రూ.1,50,000, ఇంజినీర్‌/ఆఫీసర్‌కు రూ.40,000 – రూ.1,40,000, జూనియర్ ఇంజినీర్‌ అసిస్టెంట్-2-గ్రేడ్‌-2కు రూ.25,000 – రూ.86,4000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, అడిషనల్ చీఫ్ మేనేజర్‌కు రూ.90,000 – రూ.2,40,000 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://jobse2.hurl.net.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

⦿ మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108

⦿ దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 6

Also Read: Indian Military Academy: గుడ్‌న్యూస్.. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×