BigTV English

Jagadeka Veerudu Athiloka Sundari : ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం

Jagadeka Veerudu Athiloka Sundari : ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం

Jagadeka Veerudu Athiloka Sundari : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఆ సినిమాలు మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నప్పుడు అబ్బా ఇంత గొప్ప సినిమాని ఆ రోజుల్లో ఎలా తీసారో అనే ఫీలింగ్ రాక మానదు. కానీ ఆ సినిమా తెరకెక్కించడం వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎన్నో కష్టాలు తర్వాత కూడా ఆ సినిమాకి సరైన ఫలితం వస్తుందో రాదు తెలియని పరిస్థితి. ఇక జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ రోజుల్లో ఇంత గొప్ప సినిమాను ఎలా తీశారా అని చాలామంది ఇప్పటికే ఆశ్చర్య పడుతుంటారు. మొదట ఈ సినిమాను తీసినప్పుడు రెండు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షం. అప్పటికే ఫెయిల్యూర్స్ లో ఉన్న నిర్మాత అశ్విని దత్ కి ఈ సినిమా కూడా కలిసి రాదు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఊహించని రీతిలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.


ఈ తరం వాళ్లు చూడాలి

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చాలామంది టీవీల్లో మాత్రమే చూశారు. కానీ ఇటువంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చాలామందికి ఒక ఊహ ఉంటుంది ఆ ఊహ ఇప్పుడు నిజం కాబోతుంది. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రింట్ కోసం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వెతుకుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ చాలామందికి ఈ సినిమా ప్రింట్ కోసం కాల్ చేశారు. అయితే ఒక దగ్గర దొరికింది అనుకునే టైంలో కంప్లీట్ గా ఆ ప్రింట్ కాలిపోయింది. మొత్తానికి ఈ ప్రింట్ దొరికిన తర్వాత దీనిని హై క్వాలిటీ లోకి మార్చి మే 9ను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు.


నాగ అశ్విన్ థాట్

ఒక గొప్ప సినిమాను ప్రేక్షకులకు చూపించడానికి నాగి ఎప్పుడూ తపన పడుతూనే ఉంటారు. ఇక ఈ సినిమా విషయంలో కూడా ప్రియాంకకు నాగి తరచుగా చెప్తూనే ఉండేవాడు అంట. అలా చెప్పడం వల్ల ఈ ప్రింట్ దొరికే నేడు ప్రేక్షకులకి మరోసారి ఇంత గొప్ప సినిమాను అందజేస్తున్నారు. ఇక ఈ సినిమా థాట్ ఈ సినిమా విజువల్స్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా దేనికవి గొప్పగా ఉంటాయి. వీటన్నిటిని మించి ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిల్చబెట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మే తొమ్మిది నుంచి ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×