BigTV English

UPSC Notification: యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకా 3 రోజులే ఛాన్స్..

UPSC Notification: యూపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకా 3 రోజులే ఛాన్స్..

UPSC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. యూనియన్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ జాబ్ వస్తే మంచి భవిష్యుత్తు ఉంటుంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, డిగ్రీ(కెమికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్), బీటెక్‌ లేదా బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎల్ఎల్‌బీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) లో పలు రకాల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 1వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

పోస్టుల సంఖ్య: 111


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సిస్టమ్ అనలిస్ట్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ (నావల్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ఇంజినీర్ (నావల క్వాలిటీ అస్యూరెన్స్ మెకానికల్), జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ లెజిస్టేటివ్ కౌన్సిల్ (హిందీ బ్రాంచ్) పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

 సిస్టం అనలిస్ట్‌: 01
 డిప్యూటీ కంట్రోలర్‌: 18
 అసిస్టెంట్ ఇంజినీర్‌: 01
 అసిస్టెంట్ ఇంజినీర్‌(నావల్ క్వాలిటీ అస్యూరెన్స్‌ ఎలక్ట్రికల్‌): 07
 అసిస్టెంట్ ఇంజినీర్‌(నావల్ క్వాలిటీ అస్యూరెన్స్‌ మెకానికల్‌): 01
జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్‌: 13
 అసిస్టెంట్ లెజిస్లేటివ్‌ కౌన్సిల్(హిందీ బ్రాంచ్‌): 04
 అసిస్టెంట్‌ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌: 66

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 12

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 1

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, డిగ్రీ(కెమికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్), బీటెక్‌ లేదా బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు:  పోస్టు ఆధారంగా వయస్సును నిర్ధారించారు. అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 30 – 40 ఏళ్లు, అసిస్టెంట్ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు 40 – 45 ఏళ్లు, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు 30 – 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్‌(మెకానికల్‌)కు 30 ఏళ్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్)కు 30 – 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్‌(కెమికల్)కు 30 ఏళ్లు, డిప్యూటీ కంట్రోలర్‌కు 35 – 45 ఏళ్లు, సిస్టం అనలిస్ట్‌కు 35 ఏళ్ల వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ:  అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ కి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://upsc.gov.in/

అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Also Read: NHAI Jobs: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో జీతాలు, ఇంకా 2 రోజులే ఛాన్స్..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

పోస్టుల సంఖ్య: 111

దరఖాస్తుకు లాస్ట్ డేట్: మే 1

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా..

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×