19 Years For Pokiri : ఈ సినిమా ఆడదు, ఈ సినిమాలో అన్ని గన్స్ ఉన్నాయి. ఒక ఆడది లేదు ఫ్యామిలీ లేదు అంటూ ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి కొంతమంది అన్నారు. అవును కదా ఇలియానా ముమైత్ ఖాన్ తప్పితే ఎవరున్నారు అని అనుకున్నాడు పూరి జగన్నాథ్. వాళ్ల ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే అని అనుకున్నాడు. కట్ చేస్తే ఏప్రిల్ 28, 2006 లో వచ్చిన ఈ సినిమా ఒక ప్రభంజనం. పండుగాడు బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపించాడు. ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరు ఊహించలేరు. అలా ఒకవేళ ఊహించగలిగితే ప్రతి డైరెక్టర్ హిట్ సినిమాలు తీస్తాడు. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఆ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు నేను ఆ సినిమా ఏమి తీసానా అని పూరి జగన్నాథ్ కూడా చూసుకున్నాడు. కానీ పూరీకి అర్థం కాలేదు.
మహేష్ బాబుకి రాసిపెట్టి ఉంది
పూరి జగన్నాథ్ రవితేజ మధ్య ఎంతటి ఫ్రెండ్షిప్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటినుంచి నేను నిన్ను హీరోగా పరిచయం చేస్తాను అని పూరి జగన్నా చెబుతూ ఉండేవాడు. కానీ ఏ రోజు కూడా రవితేజ ఆ విషయాన్ని నమ్మలేదు. కట్ చేస్తే ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న తమిళ అమ్మాయి వంటి హిట్ సినిమాలను హీరో రవితేజ కెరీర్ కి అందించాడు పూరి జగన్నాథ్. ఇక ఉత్తం సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ తో రవితేజకు కథను చెప్పాడు. రవితేజకు కూడా కథ విపరీతంగా నచ్చింది. రవితేజ హీరోగా నాగబాబు ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. కానీ అప్పటికే రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాతో బిజీగా ఉండటం వలన ఈ సినిమాను చేయలేకపోయాడు.
ఉత్తం సింగ్ పోకిరి అయ్యాడు
ఆ తర్వాత ఈ సినిమాను మహేష్ బాబుకి చెప్పారు. మహేష్ బాబు కథలో చెప్పిన కొన్ని మార్పులు వలన కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే టైటిల్ ను అనుకున్నారు. అయితే అప్పటికి అసోసియేట్ గా పని చేస్తున్న మెహర్ రమేష్, ఈ టైటిల్ పెడితే సినిమా ట్విస్ట్ రివిల్ అయిపోతుంది అని. పోకిరి టైటిల్ని డిజైన్ చేసి పూరి జగన్నాథ్ కి చూపించాడు. పూరి జగన్నాథ్ కు నచ్చడంతో అదే టైటిల్ ఫిక్స్ చేశారు. పోకిరి`లో హీరోయిన్‌గా మొదట బాలీవుడ్ భామ ఆయేషా టకియా పేరును అనుకున్నారు. దీపికా పదుకునే ఫొటోలు కూడా పరిశీలించారు.`వెన్నెల ఫేమ్ పార్వతీ మెల్టన్ ని కూడా అనుకున్నారు. ఫైనల్ గా ఇలియానాని ఓకే చేశారు. 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్‌గా నిలిచిపోయింది చిత్రం పోకిరి`లో మహేష్‌బాబు ముద్దుపేరు `పండు. దర్శకుడు పూరి జగన్నాథ్ భార్య లావణ్య ముద్దు పేరు అది. ఇదే విషయాన్ని బిజినెస్మెన్ ఆడియో లాంచ్ లో పూరి చెప్తాడు.
Also Read : 8 Years Fo Bahubali 2 : ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించి నేటికీ ఎనిమిదేళ్లు