Rashmika Mandanna: రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు ఫ్యాన్స్ నుండి, ప్రేక్షకుల నుండి ప్రేక్షకుల నుండి ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. అలాంటి సమయంలో పోలీసులు, అధికారులే వారిని కాపాడాలి. అలాంటిది రాజకీయ నాయకులే సినిమా వాళ్లను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది.? గత కొన్నిరోజులుగా కర్ణాటకలో అదే జరుగుతోంది. బెంగుళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో సినీ సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు మధ్య ఏర్పడిన మనస్పర్థలు ఇంకా కుదుటపడలేదు. అదే సమయంలో రష్మిక మందనా (Rashmika Mandanna)కు ప్రొటెక్షన్ అవసరమంటూ కొడవ నేషనల్ కౌన్సిల్ (సీఎన్‌సీ) స్పెషల్ రిక్వెస్ట్ సిద్ధం చేసింది.
సీఎన్‌సీ రిక్వెస్ట్
ఇటీవల కన్నడ సినిమాతో పాటు ఇండియన్ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చి బెంగూళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసింది. దానికోసం పలువురు సెలబ్రిటీలకు స్పెషల్ ఆహ్వానం పంపింది. అందులో భాగంగా తాను వెళ్లి రష్మికను స్వయంగా ఆహ్వానించానని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గనిగ. ఆ సమయంలో తాను ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నందుకు హైదరాబాద్ అమ్మాయిని అని రష్మిక స్టేట్‌మెంట్ ఇచ్చిందని, తన అంతు చూస్తానని ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చారు రవి కుమార్. దీంతో రష్మిక ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. అందుకే సీఎన్‌సీ ముందుకొచ్చి మరీ రష్మికకు ప్రొటెక్షన్ కావాలని కోరింది.
ప్రొటెక్షన్ కావాలి
యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకకు, కర్ణాటక హోమ్ మినిస్టర్ జీ పరమేశ్వరకు కొడవ నేషనల్ కౌన్సిల్ ఉత్తరాలు రాసింది. ఎమ్మెల్యే రవి కుమార్ గనిగ చేసిన వ్యాఖ్యల తర్వాత రష్మిక మందనాకు కచ్చితంగా ప్రొటెక్షన్ అవసరమని కోరింది. రష్మికను ఆ ఎమ్మెల్యే వేధిస్తూ భయపెడుతున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు సీఎన్‌సీ ప్రెసిడెంట్ ఎన్‌యూ నచప్ప. ఇది రౌడీయిజం అని అన్నారు. కన్నడలోనే కాదు ఇండియన్ సినిమాలోనే రష్మిక సాధించిన ఘనతలను అందరికీ గుర్తుచేశారు నచప్ప. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి నటులతో పనిచేసి సొంతంగా ఏ అండా లేకుండా సక్సెస్ అయ్యిందని ప్రశంసించారు.
Also Read: మహానటి సావిత్రిపై కీలక వ్యాఖ్యలు.. చేసిన తప్పుకు శిక్ష అనుభవించిందంటూ.?
వేధించడం బాధాకరం
‘‘రష్మికకు తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని సీఎన్‌సీ భావిస్తోంది. ప్రభుత్వం చెప్పినట్టుగా తను నడుచుకోవాల్సిన అవసరం లేదు. కేవలం తన కమ్యూనిటీ కారణంగానే రష్మికను టార్గెట్ చేస్తున్నారు. కావేరి నదిపై ఆధారపడే మండ్యా లాంటి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అదే ప్రాంతానికి చెందిన రష్మికను ఈ విధంగా వేధించడం చూస్తుంటే బాధేస్తుంది’’ అంటూ రష్మికకు అండగా నిలబడింది సీఎన్‌సీ. 2016లో విడుదలయిన కన్నడ సినిమా ‘కిర్రిక్ పార్టీ’తో తన కెరీర్‌ను ప్రారంభించింది రష్మిక మందనా. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఆఫర్లు రావడం మొదలయిన తర్వాత తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక టాలీవుడ్‌లోకి వెళ్లి ఫేమ్ దక్కించుకున్న తర్వాత రష్మిక పూర్తిగా మారిపోయిందని ఇప్పటికీ చాలామంది కన్నడ ప్రేక్షకులు తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అందులో ఎమ్మెల్యే రవి కుమార్ కూడా యాడ్ అయ్యారు.