Freshers Hiring: బీటెక్ పూర్తి చేసే అభ్యర్థులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకాలు భారీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెండింతల నియామకాలు జరగనున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థులకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు రావొచ్చు.
ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరం కన్నా ఏప్రిల్ నుంచి మొదలు కానున్న ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్ష 50వేల మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకోనున్నారు. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రెట్టింపు నియామకాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రిక్రూటింగ్ సంస్థ టీమ్ లీజ్ తన రిపోర్టులో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఐటీలో ఫ్రెషర్ల నియామకాల సంఖ్య 85 వేల నుంచి 95 వేల వరకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొన్ని కంపెనీలు అయితే 2లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్, క్యాప్ జెమిని వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు 1,60,000 నుంచి 1,80,000 మంది వరకు కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉందని రీసెర్చ్ అండ్ డేటా సంస్థ అన్ ఎర్త్ సైట్ అంచనా వేసింది. 2024 లో ఐటీ కంపెనీలు చాలా మందిని ఉద్యోగం నుంచి తీసేశాయి.
కొత్తగా ఉద్యోగాల నియామకాలపై కంపెనీలు ఆచితూచి ముందుడుగు వేశాయి. 2024-25 ఎకానమిక్ ఇయర్ లో కొత్త వారి సంఖ్య కొంత పెరిగిందనే చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధి విధానాల కారణంగా ఇటీవల కాలంలో ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, చాలా కంపెనీలు తమ శ్రామిక శక్తిని, ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ రోల్స్ లో ఉద్యోగం కల్పించేందుకు ఎదురు చూస్తున్నాయని.. ఈ నైపుణ్యంతో తాజాగా డిగ్రీ, బీటెక్ లు పూర్తి చేసుకుని వచ్చే వారి నియామకాలు పెరిగే అవకాశం ఉందని టీమ్ లిజ్ డిజిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ వెల్లడించారు.
ALSO READ: BANK OF BARODA: గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడగింపు