IDBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ లేదా బీసీఏ, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్‌బీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ/పీజీడీఎం పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) బ్యాంక్ లో 119 ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 20 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 119
ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 119 మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.
పోస్టులు – వెకెన్సీలు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)- గ్రేడ్ డీ : 8 పోస్టులు
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) – గ్రేడ్ సీ : 42 పోస్టులు
మేనేజర్ – గ్రేడ్ బీ : 69 పోస్టులు
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 4
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 20
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ లేదా బీసీఏ, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్‌బీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ/పీజీడీఎం పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డీ ఉద్యోగానికి కనిష్ట వయస్సు 35 ఏళ్ల, గరిష్ట వయస్సు 45 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి కనిష్ట వయస్సు 28 ఏళ్లు, గరిష్ట వయస్సు 40 ఏళ్ల మించరాదు. మేనేజర్ గ్రేడ్ బీ ఉద్యోగానికి కనిష్ట వయస్సు 25 ఏళ్ల, గరిష్ట వయస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు రూ.1050 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డీ ఉద్యోగానికి రూ.1,0,2300 నుంచి రూ. 1,97,000 వేతనం ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సీ ఉద్యోగానికి రూ.85,920 నుంచి రూ.1,64,000 వేతనం ఉంటుంది. మేనేజర్ గ్రేడ్ బీ ఉద్యోగానికి రూ.64,820 నుంచి రూ.1,24,000 వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ప్రారంభ షార్ట్‌లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలా ఎంపికైన అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్‌తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ కు పిలుస్తారు. ఉద్యోగ ఎంపిక ప్రక్రియ అనేది అర్హతలతో పాటు అనుభవం ఆధారంగా ఉంటుంది.
నోటిఫికేష్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.idbibank.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 119
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 20
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!