BigTV English
Advertisement

MI Vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా

MI Vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా

MI Vs RCB : సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ అంటే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్ టీమ్ లో రోహిత్ శర్మ ఆటకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ముంబయి జట్టులో కీలక బౌలర్ బుమ్రా లేకపోవడం.. బ్యాటింగ్ లో తడబడటంతో ముంబయి టీమ్ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. ఇవాళ ఆర్సీబీ వర్సెస్ ముంబయి మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.


ఆర్సీబీ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ముఖ్యంగా ముంబయి బౌలింగ్ లో ప్రధాన బలం బుమ్రానే. చురకత్తుల్లాంటి బంతులతో ప్రత్యర్థులు ఎవ్వరైనా సరే.. బెంబేలు పెట్టించే సత్తా అతని సొంతం. అతడి బౌలింగ్ ను ఎదుర్కొని క్రీజులో నిలవడం ఎంతటి బ్యాటర్లకైనా సవాలే. మరి అలాంటి బుమ్రా లేకుండానే ఈ సీజన్ ను మంబయి ఇండియన్స్ ప్రారంభించింది. గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్ నెస్ తో ఈ పేస్ గుర్రం తిరిగి జట్టులోకి వచ్చేసింది.

ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో ప్రారంభించింది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. మరి ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టు జట్టులోకి వస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతని రాకతో ముంబయి బౌలింగ్ విభాగం పటిష్టంగా మారుతుందనడంలో ఏ సందేహం లేదు. జట్టు పేస్ భారాన్ని బౌల్ట్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా మోస్తూ వచ్చారు.


ఇప్పటి వరకు ముంబై జట్టు తరపున ఎక్కువ వికెట్లు 8 తీసిన బౌలర్ గా పాండ్యానే కొనసాగుతున్నాడు. కేవలం ఒక్క మ్యాచ్ లోనే పాండ్యా 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్ లో ముంబయి జట్టు ఓడిపోవడం విశేషం. బుమ్రా జట్టులోకి వస్తే.. అశ్వనికుమార్ ను పక్కనే పెట్టే అవకాశాలున్నాయి. ఇక బెంగళూరుతో మ్యాచ్ కావడంతో ఆ జట్టుపై కూడా బుమ్రాకు మంచి రికార్డే ఉంది. గత ఏడాది వాంఖడే స్టేడియంలో బెంగళూరు పై అతను సాధించిన 5 వికెట్ల ప్రదర్శన మరువలేనిది అనే చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆ జట్టుతో బుమ్రా 19 మ్యాచ్ లు ఆడి.. 7.45 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టాడు. మరోసారి విజృంభిస్తే.. ఆర్సీబీని తక్కువ స్కోర్ కే కట్టడం చేయవచ్చు.  ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, సాల్ట్ బుమ్రాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికతోనే రావాలి. మరోవైపు బుమ్రా బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తామని ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ పేర్కొన్న విషయం తెలిసిందే. గత సీజన్ లో డేవిడ్ ముంబయి జట్టుకు ఆడటం గమనార్హం.

ఆర్సీబీ జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

ముంబయి ఇండియన్స్ జట్టు : విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్

Related News

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

Big Stories

×