Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం స్కీం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ జనాభా ప్రాతిపదికన యూనిట్లు ఖరారు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధిత మండలాలు, మున్సిపాలిటీల్లోని సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. రూ.50 వేల విలువైన యూనిట్లకు వంద శాతం రాయితీ ఇవ్వనుంది. జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అర్హుల తుది ఎంపికలు పూర్తి చేయాలని పేర్కొంది. ఈ పథకం విధివిధానాలను రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్ లైన లో కూడా ఈ స్కీంకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు మంచి స్పందన వస్తోంది. నిన్నటి వరకు రాష్ట్రంలో 9 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా వారం రోజులే గడువు ఉంది. ఈ వారం రోజులలో భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 14 వరకు మొత్తం 20 లక్షల దరఖాస్తులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు, ఇంటర్ నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తుతున్నారు.
ALSO READ: BEL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.90,000.. ఇంకా 4 రోజులే భయ్యా..
ఇంకా వారం రోజులే గడువు
రేవంత్ సర్కార్ నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం రాజీవ్ యువ వికాసం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాల వారికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కీం ద్వారా యువత సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం రాయితీలు, బ్యాంకు రుణాల ద్వారా సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి ఈ నెల 4 తో గడువు ముగియాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వచ్చింది. దరఖాస్తుకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. కొంతమంది కొత్త క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ కోసం మీ సేవ సెంటర్లలో భారీగా దరఖాస్తు చేస్తుకుంటున్నారు.
కొత్త క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు అవసరం లేదు..
అయితే.. కొత్తగా క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదని.. 2016 తరువాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్‌కమ్ అవసరం లేదని చెబుతున్నారు. ఈ పథకం గురించి సమాచారం, అర్హత, ఇతర సమగ్ర వివరాల కోసం.. మండల, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్లను మే 31 వరకు మండల, జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేయనున్నారు. లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి.. జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపనున్నారు.
జూన్ 2న రుణాలు మంజూరు
జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తరువాత.. జూన్ 2న ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుంది. ఈ పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు.. అప్లికేషన్ లో తమ బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్రాంచ్ వివరాలు కచ్చితంగా తెలిపాలి. ఈ పథకానికి అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. మున్సిపాలిటీల్లో కమిషనర్ కార్యాలయంలో ఇవ్వాలి.
అధికారిక వెబ్ సైట్: https://tgobmmsnew.cgg.gov.in/
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 14స
ALSO READ: AAI Recruitment: ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే రూ.31,000