BigTV English

OTT Movie: కష్టాలను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే స్టోరీ.. కామెడీతో పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..

OTT Movie: కష్టాలను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే స్టోరీ.. కామెడీతో పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..

OTT Movie: ఓటీటీలోకి పలు రకాల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులు గుర్తుండిపోయేలా మంచి రెస్పాన్స్ ని అందుకుంటాయి. ఈమధ్య థియేటర్లో కన్నా ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కామెడీ సినిమాలతో పాటు హారర్ సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతివారం బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ కామెడీ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూద్దాం..


Also Read :హిస్టరీ రిపీట్.. ‘పుష్ప 2’ ను వెనక్కి నెట్టేసిన ‘మ్యాడ్ 2’..!

మూవీ & ఓటీటీ.. 


తెలుగులో కామెడీ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాలు కామెడితో కడుపుబ్బా నవ్విస్తున్నాయి. అలాంటి చిత్రాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. 2022లో తెలుగులో కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ముత్తయ్య ఓటీటీ ప్రీమియర్‌కు రెడీ అవుతోంది.. సినిమాల్లో నటించాలనే 70 ఏళ్ల వృద్ధుడు కోరికను ఈ మూవీ తీర్చింది. తన కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు అధిగమించిన ముత్తయ్య జర్నీ ఎంతో స్పూర్తిని పంచుతుంది. ముత్తయ్య సినిమాకు డైరెక్టర్ భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్ల పై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. సుధాకర్ రెడ్డి ముత్తయ్య పాత్రలో నటించాడు. అప్పటిలో ఈ మూవీ మంచి రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది. అయితే ఈ మూవీ డేట్ ను మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.. త్వరలోనే ఆ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

స్టోరీ విషయానికొస్తే.. 

70 ఏళ్ల వయసులో ని వ్యక్తి సినిమా స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని అనుకుంటాడు. ఆ కోరికను తీర్చుకోవాలని ఎన్నో కలలు కూడా కంటాడు. ఈ క్రమంలో ఎన్నో అవరోధాలను అధిగమించి చివరికి తన కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు.కామెడీ డ్రామాగా తెరకెక్కిన ముత్తయ్య సినిమా లండన్‌లోని యుకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శితమైంది.. అలాగే 28వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ కేటగిరీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, దుబాయ్‌ లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడి బెస్ట్ ఫిల్మ్ ఫీచర్ జ్యురీ అవార్డును కూడా అందుకుంది. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఈటీవీ విన్ రీసెంట్‌గా ఎన్నో క్లాసిక్ మూవీస్ స్ట్రీమింగ్ చేసింది. వేసవి చివరిలో ఈ మూవీతో బాగా ఎంజాయ్ చేస్తారని చిత్ర నిర్మాత అంటున్నాడు. ఓటీటలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూద్దాం.. ఏది ఏమైనా ఇటీవల ఓటీటీలోకి ఇలాంటి సినిమాలు వచ్చేస్తుంటాయి. ఇక్కడకు వచ్చిన సినిమాలు మంచి రెస్పాన్స్ ను అందుకొని భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి.

 

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×