DME Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, పీజీ, పీజీ డిప్లొమా, బీఎస్సీ, బీటెక్/ బీఈ, ఎంఫిల్/ పీహెచ్‌డీ, డీఎంఎల్టీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏపీ, ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 16న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. స
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 122
కాంట్రాక్ట్ విధానంలో: 46 పోస్టులు
కాంట్రాక్ట్ విధానంలో: 76 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో.. బీఎస్సీ లేదా బీటెక్/బీఈ, డిప్లొమా, ఇంటర్, టెన్త్, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ, డీఎంఎల్టీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 2
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 16
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 42 మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.15వేల నుంచి రూ.54,060 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు చిరునామా: దరఖాస్తు ఫారంను ప్రిన్సిపాల్ కార్యాలయం, డా.ఎల్లాప్రగడ సుబ్బారావు, ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు చిరునామాకు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://eluru.ap.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: IOCL Jobs: ఐఓసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్, దరఖాస్తుకు ఇంకా 3 రోజులే గడువు..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 122
దరఖాస్తు చివరి తేది: జూన్ 16
జీతం: రూ.15,000 నుంచి రూ.54,060