Vande Bharat Express Food: వందేభారత్ రైళ్లలో నాన్ వెజ్ రచ్చ నడుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా బ్రేక్-ఫాస్ట్ మెనూ నుంచి నాన్ వెజ్ తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై నుంచి నాగర్ కోయిల్, మైసూరు, బెంగళూరు, తిరునెల్వేలి వంటి మార్గాలలో నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్-వెజ్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ ను తొలగించడంపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుకు సంబంధించి సదరన్ రైల్వే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నుంచి ఎటువంటి ముందస్తు ప్రకటన లేకపోవడంతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. IRCTC యాప్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు, ప్రయాణీకుల వ్యక్తిగత వివరాలు, ఫుడ్ సెలెక్షన్ చేసిన తర్వాత ‘నాన్-వెజ్ ఎంపిక లంచ్, డిన్నర్ కు మాత్రమే వర్తిస్తుంది‘ అని ఒక పాప్-అప్ కనిపిస్తోంది. ఇలా కనిపించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ రైల్వేకు ప్రయాణీకుల ఫిర్యాదులు
బ్రేక్ ఫాస్ట్ నుంచి నాన్ వెజ్ ను తొలగించడంపై ప్రయాణీకులు ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేస్తున్నారు. చెన్నై నుంచి నాగర్ కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన డేవిడ్ మనోహర్ అనే ప్రయాణీకుడు, బుకింగ్ సమయంలో నాన్-వెజ్ ఎంపికను ఎంచుకున్నప్పటికీ, ఆన్ బోర్డ్ లో కేవలం వెజిటేరియన్ ఆహారం మాత్రమే అందించారన్నారు. నాన్-వెజ్ ఎంపిక సాయంత్రం టీ సమయంలో మాత్రమే అందుబాటులో లేదని IRCTC వెల్లడించిందని, ఆ తర్వాత సదరు పోస్టును డిలీట్ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నా ఫుడ్ ఆప్షన్ ను మార్చడం కరెక్ట్ కాదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి సదరన్ రైల్వే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇతర రైల్వే అధికారులు మాత్రం IRCTC యాప్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని చెప్పారు.
Read Also: ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్, నెట్టింట వీడియో వైరల్!
ఫుడ్ క్వాలిటీ పైనా ఫిర్యాదులు
నాన్-వెజ్ బ్రేక్ ఫాస్ట్ తొలగింపుతో పాటు, ఆహార నాణ్యతపై కూడా ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నై-తిరునెల్వేలి మార్గంలో పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా తయారైందన్నారు. రైళ్లు ప్రారంభం అయిన కొత్తలో ఫీడ్ బ్యాక్ ఫారమ్ లు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఫిర్యాదులకు స్పందన లేదు. పప్పు నీళ్లలా ఉంది. రోటీలు దారుణంగా ఉంటాయి. రైస్ కూడా తక్కువగా ఉంది’’ అని తరచూ ప్రయాణించే ఎన్ మురళీధరన్ వెల్లడించారు. మెనూలో ఎక్కువగా నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుందని, సౌత్ ఇండియన్స్ కు నచ్చడం లేదని ఎల్ సెల్వం అనే ప్రయాణీకుడు వెల్లడించారు. వందేభారత్ లాంటి అత్యాధునిక రైళ్లలో అందించే ఫుడ్ విషయంలోనూ పరిస్థితి ఇలా ఉంటే, మిగతా రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ప్రయాణీకులు.
Read Also: చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బోలెడు బస్సులు, ఇక ఆ కష్టాలు తీరినట్లే!