E-Paper
Advertisement

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. లక్షకు పైగా జీతం.. ఇంకా వారం రోజులే గడువు..

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. లక్షకు పైగా జీతం.. ఇంకా వారం రోజులే గడువు..
Advertisement

Bank of Baroda: డిగ్రీ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోండి. ఇంకా అప్లికేషన్ కు వారం రోజులే గడువు ఉంది.

బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in) ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1267

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

Advertisement

డిపార్ట్ మెంట్- రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్: 200 పోస్టులు

డిపార్ట్​మెంట్ – రిటైల్ లయబిలిటీస్: 450 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 341 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 9 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఫెసిలిటీ మేనేజ్మెంట్: 22 పోస్టులు

డిపార్ట్​మెంట్ – కార్పొరేట్ అండ్ ఇన్​స్టిట్యూషనల్ క్రెడిట్: 30 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఫైనాన్స్: 13 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 177 పోస్టులు

డిపార్ట్​మెంట్ – ఎంటర్​ప్రైజ్ డేటా మేనేజ్​మెంట్ ఆఫీస్: 25 పోస్టులు

దరఖాస్తు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 28

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 17

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పలు ఉద్యోగాలకు బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎఫ్‌ఏ వంటి కోర్సులు ఉంటే ప్రాధాన్యత ఉటుంది. కొన్ని పోస్టులకు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 20 నుంచి 40 ఏళ్ల మద్య వయస్సు కలిగి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది)

ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

ఆన్ లైన్ పరీక్షలో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 225కి ఉంటుంది. పరీక్ష వ్యవధి 150 నిమిషాల వరకు ఉంటుంది.

పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.600(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి)

అఫీషయల్ వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in

జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.48,480 నుండి రూ. 1,35,020 వరకు ఉంటుంది .

ఈ బ్యాంకు ఉద్యోగం పొందిన వారికి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, లీవ్ సదుపాయాలు, పెన్షన్ ,ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

Also Read: AIIMS Jobs: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

దరఖాస్తుకు ఇంకా వారం రోజులే గడువు ఉంది. వీలైనంత త్వరగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×