BigTV English

Hyderabad Metro : ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. తృటిలో తప్పిన ప్రమాదం

Hyderabad Metro : ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా వచ్చిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. తృటిలో తప్పిన ప్రమాదం

Hyderabad Metro : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో,  అత్యంత వేగంతో నిత్యం లక్షలాది మందిని గమ్య స్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో.. రోజు వందల ట్రిప్పులు తిరుగుతోంది. అలాంటి.. మెట్రోలోని సాంకేతిక సమస్య కారణంగా.. కాస్తలో పెను ప్రమాదం తప్పింది. సమర్థవంతమైన ట్రాకింగ్, రన్నింగ్ మేనేజ్మెంట్ సాంకేతికతలు వినియోగిస్తున్న మెట్రో వ్యవస్థలో..  రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీదకు రావడంతో.. అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ సమయంలో.. రద్దీ తక్కువగా ఉండడం, రైళ్లను కాస్త దూరంలోనే నిలిపివేయగలగడంతో.. ప్రమాదం తప్పిందంటున్నారు. ఇప్పుడు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


హైదరాబాద్ లో మెట్రో సేవలు మొదలైనప్పటి నుంచి రద్దీ క్రమంగా పెరుగుతుంది తప్పా తగ్గడం లేదు. దీంతో.. అదనపు కోచ్ ల కోసం  సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతా డిమాండ్ ఉన్న తరుణంలో.. ప్రయాణికుల కోసం మరిన్న సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు. ఒక రైలు వెళ్లిన వెంటనే.. మరో రైలును నడుపుతూ.. ప్రయాణికుల్ని వెనువెంటనే గమ్య స్థానాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్ లోనూ.. మెట్రోకు సంబంధించిన ప్రతీ కదలికను సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా నియంత్రిస్తూ ఉంటారు. అలాంటి.. వ్యవస్థలున్నా కూడా మెట్రో రైళ్ల రాకపోకలో ఓ తప్పిదం జరిగింది.

అప్పుడే.. స్టేషన్ కి వచ్చి.. ఇంకా ప్లాట్ ఫారమ్ మీద నుంచి కదనే లేదు.. వెనుక మరో మెట్రో వేగంగా వచ్చేసింది. రెండు రైళ్లు ఒకదానికొకటి కనిపించేటంత దగ్గరగా రావడంతో.. అధికారులు, సిబ్బంది సైతం కంగారు పడ్డారు. కానీ.. రెండో రైలులోని సిబ్బంది అప్రమత్తత కారణంగా.. వెంటనే రెండో రైలును నిలిపివేశారు. ఒకే ట్రాక్ పైకి రెండు మెట్రో రైళ్లు అతి సమీపంలో ఉన్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.


ఈ ఘటన.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో లక్డీ కా పూల్  మెట్రో స్టేష్టన్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి.. ఒకే ట్రాక్ పై వెళ్లే రెండు రైళ్లకు మధ్య..  ప్రయాణ వ్యవధి కనీసం 90-120 సెకన్లు ఉంటుంది. ఇది.. మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. ఇందుకోసం..సాంకేతికతను వినియోగిస్తారు. పూర్తిగా.. మానవ ప్రమేయం లేని.. సీబీటీసీ – కమ్మూనికేషన్ బేస్ట్ ట్రైన్ కంట్రోల్ సాంకేతికతతో పనిచేస్తోంది.

ఈ సాంకేతికత ప్రకారం.. ఓ స్టేషన్ లో ఓ రైలు ఆగితే.. పక్క స్టేషన్ లో మరో రైలు ఆగుతుంది. వాటి మధ్య అంతటి గడువు ఉంటుంది. అంతే కానీ.. రెండూ ఒకే సమయానికి ఒకే దగ్గరకు వచ్చేందుకు వీలుండదు. కానీ.. అలా జరగడంతో అంతా అవాక్కవుతున్నారు.  అయితే.. ఈ తప్పిదంపై మెట్రో సంస్థ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read : రైతు భరోసాపై మరో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవల కాలంలో మెట్రో రైళ్లల్లో ఇలాంటి నిర్వహణ లోపాలు కనిపిస్తున్నాయి. ట్రాక్ మధ్యలో రైలు నిలిచిపోవడం, స్టేషన్ కి వచ్చిన తర్వాత కూడా డోర్లు తెరుచుకోకపోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు జరిగినట్లుగా.. ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు వచ్చిన ఘటన 2019లో చోటుచేసుకుంది. అప్పట్లో మియాపూర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వెళ్లే మెట్రో ట్రాక్ మారి.. మరో ట్రాక్ లోకి వెళ్లింది. దాంతో.. ఎదురుగా వచ్చే రైలును ఢీ కొట్టే పరిస్థితి నెలకొంది. అప్పటికే.. తప్పిదాన్ని గ్రహించిన అధికారులు.. మరో ట్రాక్ లో రైళ్ల రాకపోకల్ని నియంత్రించి.. రైలు ట్రాక్ ను సరిచేశారు. మళ్లీ.. ఇప్పుడు.. ఈ ఘటనతో మెట్రో తప్పిదాలు.. మరోసారి చర్చనీయాంశమైంది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×