Brahmanda Movie : సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రహ్మాండ’ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను సినీ బృందం విడుదల చేసింది. “అఖండ” ప్రొడ్యూసర్ చేతుల మీదుగా లాంఛ్ అయిన ఈ పోస్టర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాబోతున్న బ్రహ్మాండ చిత్రంలో ఆమని ప్రధాన పాత్రలో నటించారు. శ్రీమతి దాసరి మమత సహ నిర్మాతగా వ్యవహరించారు. ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అఖండ చిత్ర ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ లుక్ తో సినిమాలో ఆమని పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తుంది. ఇక లేడీ ఓరియంటెడ్ గా రాబోతున్న ఇందులో ఆమని పాత్ర మరింత కీలకంగా మారనుందని సినీ ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేసిన మిర్యాల రవీందర్.. అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో.. ఈ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకుంటుందని తెలిపారు. టీజర్ డిజైన్స్ సైతం చాలా బాగున్నాయని.. సినిమా యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేశారన్నారు. సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నానని.. అందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ తెలిపారు. అనంతరం సినిమా ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేసినా మిర్యాల రవీందర్ కి ఎప్పుడూ రుణపడి ఉంటానని నిర్మాత దాసరి సురేష్ తెలిపారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి కచ్చితంగా విజయవంతం చేయాలని హీరో బన్నీ రాజు తెలిపారు.
‘బ్రహ్మాండ’ కథ విషయానికి వస్తే.. ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో వారి జీవన శైలిని కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు తెలుస్తుంది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే అర్ధం శివుని చేతిలోని ఢమరుకం. తెలంగాణ ప్రాంతంలో మాత్రమే వినిపించే ఈ పదం అచ్చమైన దేశీపదం. ఈ ఒగ్గు సంసృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథ, స్క్రీన్ ప్లే ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని సినీ బృందం ఆకాంక్షిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనింగ్ తో పాటు డివోషనల్ థ్రిల్లింగ్ గా వచ్చేస్తున్న ఈ సినిమా గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుపుతుంది.
బ్రహ్మాండలో ఆమని, జయరామ్, కొమరం బన్నీ రాజ్, కనిక వాద్య , జోగిని శ్యామల ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ రంగరాజు, ప్రసన్నకుమార్ ,అనంత్ కిషోర్ దాస్, ఐడ్ల మధుసూదన్ రెడ్డి, మీసం సురేష్, దేవి శ్రీ, ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, ఛత్రపతి శేఖర్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికే కాసుల కార్తీక్ ఫోటోగ్రఫీ అందించగా.. ఎమ్మార్ వర్మ ఎడిటింగ్ వర్క్ చేపట్టారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందించగా, రమేష్ నారాయణ మాటలు అందించారు. నిర్మాతగా దాసరి సురేష్ వ్యవహరించగా, సహ నిర్మాతగా శ్రీమతి దాసరి మమత బాధ్యతలు చేపట్టారు. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రాంబాబు అందించారు.
ALSO READ : గేమ్ ఛేంజర్.. చిరంజీవి రివ్యూ ఇదే