AIIMS Jobs: ఎండీ, ఎంఎస్, డీఎం, ఎ.సీహెచ్, డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS మంగళగిరి) పలు ఉద్యోగాల భర్తీకి నోటఫికేషన్ రిలీజ్ చేసంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS మంగళగిరి) సీనియర్ రెసిడెంట్స్/సీనియర్ డిమాన్‌స్ట్రాటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 73
ఇందులో సీనియర్ రెసిడెంట్స్/సీనియర్ డిమాన్‌స్ట్రేటర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: 2025 జనవరి 23(ఉదయం 8:30గంటల నుంచి ఉదయం 11:00 గంటల వరకు జరుగును)
దరఖాస్తు ఫీజు: రూ.1500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది)
వయస్సు: వయోపరిమితికి సంబంధించి 45 ఏళ్లు మించరాదు.
విద్యార్హత: ఎండీ, ఎంఎస్, డీఎం, ఎ.సీహెచ్, డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aiimsmangalagiri.edu.in
Also Read: APPSC JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్..
అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.