BPNL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా సీఏ, సీఎస్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంవీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. భారతీయ పశుపాలమ్ నిగమ్ లిమిటెడ్ (బీపీఎన్ఎల్) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనాలు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్ కు సంబందించి పూర్తి వివరాలను క్లియర్ కట్ గా చూద్దాం.
భారతీయ పశుపాలమ్ నిగమ్ లిమిటెడ్ (బీపీఎన్ఎల్) నుంచి 12891 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడులైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 11న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12891
భారతీయ పశుపాలమ్ నిగమ్ లిమిటిడ్ లో నాలుగు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్, తహసీల్ డెవలప్ మెంట్ ఆఫీసర్, పంచాయత్ పశు సేవక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు: 44
డిస్ట్రిక్ట్ ఎక్స్ టెన్షన్ ఆపీసర్ ఉద్యోగాలు: 440
తహసీల్ డెవలప్ మెంట్ ఆఫీసర్: 2121 ఉద్యోగాలు
పంచాయత్ పశు సేవక్ పోస్టులు: 10376
విద్యార్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా సీఏ, సీఎస్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంవీఎస్సీ పాసై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 11 (మిడ్ నైట్ 12 వరకు)
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి 40 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు, డిస్ట్రిక్ట్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు, పంచాయత్ పశు సేవక్ ఉద్యోగానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.1534, డిస్ట్రిక్ట్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.1180, తహసీల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.944, పంచాయత్ పశు సేవక్ పోస్టుకు రూ.708 ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఎగ్జామ్ సెలబస్: 50 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. 30 నిమిషాల సమయం ఉంటుంది. హిందీ నుంచి 8 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 8 మార్కులు, మ్యాథ్స్ నుంచి 8 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 8 మార్కులు, డైలీ సైన్స్ నుంచి 8 మార్కులు, బేసిక్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 10 మార్కుల చొప్పున అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి నెలకు రూ.75,000, డిస్ట్రిక్ట్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.50,000, తహసీల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.40,000, పంచాయత్ పశు సేవక్ ఉద్యోగానికి రూ.28,500 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bharatiyapashupalan.com
అప్తికేషన్ లింక్: https://pay.bharatiyapashupalan.com/onlinerequirment
Also Read: HAL Recruitment: భయ్యా.. మీరు ఈ జాబ్ కొట్టి చూడుర్రి.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 12891
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 11