Naga Durga: ఫోక్ సాంగ్స్ డ్యాన్సర్ నాగదుర్గ అంటే తెలియని వారుండరు. తాజాగా ప డిజే ఫోక్ సాంగ్స్ తో నాగదుర్గ చేసిన డ్యాన్స్ కు నెటిజన్స్ తెగ ఫ్యాన్స్ అయ్యారు. అంతేకాదు అయ్యా.. కొరియోగ్రాఫర్స్ కాస్త ఇటు చూడండి. ఎందరో టాలెంట్ ఉండి కూడా మరుగున పడిపోతున్నారు అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇంతకు నాగదుర్గకు ఉన్న ఫేమ్ కాస్త ఎక్కువే. ఇప్పుడు ఒక్క పాటతో సినిమా స్టెప్పులను కూడా తలపిస్తూ ఫోక్ ఇండ్రస్ట్రీని ఒక్క ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.
ఫోక్ ప్రపంచానికి పుట్టినిల్లు
తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి పుట్టినిల్లు. ఇక్కడ గల జానపద కళాకారులు ఏ రాష్ట్రంలో లేరనే చెప్పవచ్చు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఫోక్ సాంగ్స్ లేనిదే ప్రచారం సాగదు. ఒక్క చిన్న మీటింగ్ ఏర్పాటు చేసినా, అక్కడ జానపద కళాకారులు ఉండాల్సిందే. మట్టిలో నుండి వచ్చిన మాణిక్యాల మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా జానపద కళాకారులు ఉన్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఫోక్ ప్రపంచం నుండి పరిచయమై నేడు టాలీవుడ్ రేంజ్ లో గుర్తింపు పొందిన కళాకారులు ఎందరో ఉన్నారు.
నాగదుర్గ స్టెప్ వేస్తే..
ఫోక్ సాంగ్స్ ఎంత వినసొంపుగా ఉన్నా, దానికి అభినయం చాలా అవసరం. అభినయం చక్కగా లేకుంటే ఆ ఫోక్ సాంగ్స్ కి ఆదరణ తక్కువే. ఇలా తన అభినయంతో ఎందరో అభిమానులు సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ తెలియని వారుండరు. అందానికి అందం, డ్యాన్స్ కు డ్యాన్స్ అదరగొట్టడంలో నాగదుర్గ వెరీ ఫేమస్. ఈమె పాట రిలీజ్ అయిందా? మిలియన్స్ వ్యూస్ రావాల్సిందే. అలాంటి నాగదుర్గ తాజాగా వేసిన ఓ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దారిపొంటత్తుండు..
ఇటీవల నాగదుర్గ దారిపొంటత్తుండు.. పాటకు డిజే సాంగ్ వెర్షన్ లో డ్యాన్స్ అదరగొట్టింది. మామిడి మౌనిక స్వరంలో ఈ పాట ఫేమస్ కాగా, తాజాగా డిజే వర్షన్ ట్రెండీగా మారింది. ఈ పాటలో నాగదుర్గ తన అభినయం , డ్యాన్స్ తో చించేసింది అంటూ ఆమె అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. సినిమా రేంజ్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాట ఇప్పుడు ప్రోమో విడుదల కాగా, సోషల్ మీడియా ట్రెండీగా మారింది. పాటలో నాగదుర్గ డ్రెస్ సెన్స్, నవ్వులు ఇవన్నీ కలగలిపి సాంగ్ అదుర్స్ అంటున్నారు నెటిజన్స్.
Also Read: Miss World 2025: అందాలతో హైదరాబాద్.. అదిరిపోవాల్సిందే..!
చెత్త వద్దు.. మాణిక్యాలను తీసుకోండి
ఎక్కడెక్కడి నుండో నాలుగు స్టెప్పులు రాగానే ఛాన్సులు ఇచ్చే కొరియోగ్రాఫర్స్ లక్ష్యంగా నెటిజన్స్ తెగ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నాగదుర్గ లాంటి ఫోక్ డ్యాన్సర్స్ తెలంగాణలో ఎందరో ఉన్నారని, అలాంటి వారికి ఛాన్స్ లు ఇస్తే వారు గుర్తింపు పొందే అవకాశం ఉందని నెటిజన్స్ అంటున్నారు. ఇప్పటికైనా ఫోక్ డ్యాన్సర్స్ కు మంచి అవకాశాలు అందేలా టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్స్ చొరవ చూపాలని వారు కోరుతున్నారు. మరి నెటిజన్స్ కోరిక నెరవేరుతుందో లేదో.. మున్ముందు తెలిసే అవకాశం ఉంది.