E-Paper
Advertisement

HAL Recruitment: భయ్యా.. మీరు ఈ జాబ్ కొట్టి చూడుర్రి.. హైదరాబాద్‌లో ఉద్యోగం.. రేపే లాస్ట్ డేట్

HAL Recruitment: భయ్యా.. మీరు ఈ జాబ్ కొట్టి చూడుర్రి.. హైదరాబాద్‌లో ఉద్యోగం.. రేపే లాస్ట్ డేట్
Advertisement

HAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇందులో ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం కూడా అందజేస్తారు. మరి అర్హత ఉన్న అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.

హైదరాబాద్, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్ఏఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 7వ తేదీ వరకు అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 16

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్), డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్), డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీ వారీగా

డిప్లొమా టెక్నీషియన్‌(మెకానికల్‌): 01
డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్): 02
డిప్లొమా టెక్నీషియన్‌(ఎలక్ట్రానిక్స్‌): 13

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 మే 7వ తేదీ నాటికి 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.23,000 వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 24

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 7

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://hal-india.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. హైదరాబాద్ లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. కాబట్టి అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: MED Notification: ఆ జిల్లా వారికి సువర్ణవకాశం.. ఎలాంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్, జీతం రూ.32,670

నోటిఫికేషన్ ముఖ్యసమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 16

దరఖాస్తుకు చివరి తేది: 2025  మే 7

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×