Indian Navy: నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ ఇది. ఇండియన్ నేవీ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.63,200 వరకు జీతం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, జీతం, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ నేవీలో 1315 స్కిల్డ్ ట్రేడ్స్ మేన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెప్టెంబర్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1315
ఇండియన్ నేవీలో స్కిల్డ్ ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఉద్యోగాలు – వెకెన్సీలు:
స్కిల్డ్ ట్రేడ్స్ మెన్ (రెగ్యులర్) : 1266 పోస్టులు
స్కిల్డ్ ట్రేడ్ మెన్ (బ్యాక్ లాగ్) : 49 పోస్టులు
విద్యార్హత: టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హత ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 13
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 2
వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://indiannavy.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ జాబ్ వచ్చినవారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1315
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 2