BigTV English

Coolie : వేయి ఆశలు… ఇప్పుడు కూలీ కూడా కూల్చేసింది

Coolie : వేయి ఆశలు… ఇప్పుడు కూలీ కూడా కూల్చేసింది

Coolie : తమిళనాట సినీ లవర్స్ వేయి కోసం వేయి కన్నులతో వేచి చూస్తున్నారు. ఏంటి అర్థం కాలేదా ? అదే అండి ఫస్ట్ వేయి కోట్లు కలెక్ట్ చూసే మూవీ కోసం తమిళ సినిమా అభిమానులు చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. తంగలాన్, కంగువా లాంటి సినిమాలు ఆ వేయి కలను అందుకుంటాయని అనుకున్నారు. కానీ, అవి అన్నీ తమిళ ఆడియన్స్‌ను నిరాశపరిచాయి. ఇప్పుడు వారి వేయి కలలు అన్నీ కూడా కూలీ మూవీపై ఉండేవి. మరి రజనీకాంత్ ఆ కలలను, ఆశలను తీర్చాడా ? లేకపోతే, ఆ ఎదురుచూపులు కంటీన్యూ అవుతున్నాయా ? అనేది ఇప్పుడు చూద్దాం.


కోలీవుడ్‌లో ఏదైనా అద్భుతం చేయాలంటే అది కేవలం రజనీకాంత్ తోనే అవుతుంది. తమిళనాడులో అత్యధిక కలెక్షన్లు తీసుకొచ్చిన మూవీ అంటే 2.o. దీనికి హీరో రజనీకాంతే. మళ్లీ ఇప్పుడు 1000 కోట్ల మూవీ ఈయనతోనే సాధ్యం అని అంతా అనుకున్నారు.

రజనీకాంత్ స్వాగ్‌తో పాటు లోకష్ కనగరాజ్ డైరెక్షన్ కూడా తోడవ్వడంతో కోలీవుడ్ వేయి కోట్ల కల నెరవేరినట్టే అనుకున్నారు. కానీ, ఈ సారి కూడా వేయి కల తీరలేకపోయింది. కూలీపై పెట్టుకున్న ఆశలు అన్నీ కూలిపోయాయి. మూవీ ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ టాక్ తెచ్చుకుంటుంది. మిక్సిడ్ టాక్‌తో 1000 కోట్లు తీసుకురావడం అసాధ్యమే అని చెప్పొచ్చు.


నిజానికి కూలీ మూవీకి 1000 కోట్ల స్కోప్ ఉంది. రజనీకాంత్ ఇప్పటికే 2.o మూవీకి సోలో గానే 700 కోట్ల వరకు కలెక్షన్లు తీసుకుచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండయా వైడ్ ఎంతో గుర్తింపు ఉన్న లోకేష్ కనగరాజ్ దర్శకుడు.

వీరికి తోడుగా భారీగా నటీనటులను తీసుకున్నారు. టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్. శాండిల్ వుడ్ నుంచి ఉపెంద్ర. మలయాళం నుంచి సౌబిన్ ను తీసుకున్నారు. అలాగే శృతి హాసన్ కూడా కీలక పాత్ర చేసింది.

మరో బలం.. అనిరుధ్. సాధారణంగా అనిరుధ్ మిగితా సినిమాల కంటే, రజనీకాంత్ సినిమాలకు అద్భతంగా వాయిస్తాడు. ఇప్పుడు ఆ.. డోస్ పెరిగింది. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండటం వల్ల 1000 కోట్లు కొట్టడం ఈజీనే అనుకున్నారు. కానీ, హీరో క్యారెక్టర్ ను కేవలం ఎమోషన్ కే పరిమితం చేయడం వల్ల సినిమా మొత్తం డల్ అయిపోయింది. రజనీకాంత్ కి పడాల్సిన, ఆయన అభిమానులకు కావాల్సిన ఎలివేషన్ సీన్స్ కరువయ్యాయి. దీంతో ఆయన అభిమానులకే ఈ మూవీ చప్పటి కూడు తిన్న ఫీల్ వచ్చింది.

దీంతో అందరూ ఉన్నా… మంచి సబ్జెక్ట్ ఉన్నా.. 1000 కోట్లు కొట్టే మూవీగా నిలువలేకపోతుంది అని క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

అయితే, రజనీకాంత్ ఉన్న మార్కెట్, ఇప్పుడు మూవీకి వస్తున్న మిక్సిడ్ టాక్ వల్ల కలెక్షన్లు కొంత వరకు రావొచ్చు. మరీ 1000 కోట్లు రావాలంటే, ఏదైనా అద్భుతం జరగాలి. కానీ, ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే అలాంటి అద్భుతం రావడం అంత ఈజీ కాదేమో అనిపిస్తుంది.

Related News

SIIMA 2025 : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు, వాళ్లతో విభేదాలు?

Sravanthi Chokkarapu: జాతీయ జెండాను అవమానించిన యాంకర్‌ స్రవంతి చొక్కారపు? నెటిజన్స్‌ పైర్..

War 2 – Coolie : వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్… దీంట్లో కూడీ వీటి మధ్య వార్

Mirai Hindi Rights: కరణ్‌ జోహార్‌ చేతికి మిరాయ్‌ హిందీ రైట్స్‌.. తేజ సజ్జా ఖాతాలో మరో భారీ హిట్‌…

Hero Darshan: హీరో దర్శన్ కేసు ఎఫెక్ట్… ఆ హీరోయిన్ మళ్లీ అరెస్ట్ !

Aamir Khan: ఓన్లీ 50 రూపాయలే… అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమీర్ ఖాన్!

Big Stories

×